మ‌రో షాక్‌కి రెడీగా ఉండండి… 100 నోట్లు కూడా త్వ‌ర‌లోనే ర‌ద్దు…!

untitled-1-copy

మోదీ స‌ర్కార్ మరో షాక్‌కి రెడీగా అవుతోందా..? ఇప్ప‌టికే పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేసి షాక్ ఇచ్చిన కేంద్ర ప్ర‌భుత్వం.. త్వ‌ర‌లోనే 100 నోట్ల‌ను కూడా ర‌ద్దు చెయ్యనుందా..? దీనికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసిందా…? దానికి సంబంధించిన ఏర్పాట్ల‌ను కూడా ఇప్ప‌టికే పూర్తిచేసిందా..? అంటే, అవున‌నే స‌మాధానం వస్తోంది.500, 1000 నోట్ల ర‌ద్దుతో దేశంలో ప్ర‌కంప‌న‌లు మొద‌ల‌య్యాయి. ఇటు సామాన్య ప్ర‌జ‌లు నానా ఇబ్బందులు ప‌డుతుంటే, అటు అవినీతి ప‌రులు త‌మ బ్లాక్ మ‌నీని వైట్‌గా మార్చుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ ప్ర‌భావం దేశ‌వ్యాప్తంగా అంద‌రిపై ప‌డింది. అయితే, 500, 1000 రూపాయ‌ల ర‌ద్దు నోటుతో ఇప్ప‌టికిప్పుడు దేశ ఆర్ధిక వ్య‌వ‌స్థ‌లో వ‌చ్చే మార్పులు, చేర్పులు సంగ‌తి ఎలా ఉన్నా…

ఫేక్ నోట్ల మాయ‌గాళ్ల భ‌ర‌తం ప‌ట్టిన‌ట్లయింది. కొత్త నోట్లను ఫోర్జ‌రీ చెయ్యాలంటే క‌నీసం 2 నుంచి 3 నెల‌లయినా ప‌డుతుంద‌ని కొంద‌రి అంచనా. అయితే, మార్కెట్‌లో ప్రస్తుతం న‌డుస్తున్న కొత్త నోట్లు ఫేక్ చెయ్య‌డం చాలా క‌ష్ట‌మ‌ని అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో దీనిని తీసుకురావ‌డంతో దాదాపు అసాధ్యమ‌నే వాద‌న‌లు కూడా వినిపిస్తున్నాయి. ఇదే ఇప్పుడు మోదీ స‌ర్కార్‌కి ఉత్సాహాన్ని ఇస్తోంది.అయితే, ప్ర‌స్తుతం మార్కెట్‌లో న‌డుస్తున్న 100 నోట్లు ఎప్ప‌టినుంచో ర‌న్నింగ్‌లో ఉన్నాయి కాబట్టి.. ఫోర్జ‌రీ కేటుగాళ్లు వీటిపై దృష్టి సారించారు.

దానిని ప్రింట్ చేసి మార్కెట్‌లోకి వ‌దులుతున్నారు. వ‌చ్చేది చిన్న‌మొత్త‌మే అయినా దానిని కూడా వ‌దిలి పెట్ట‌డం లేదు. దీంతో, త్వ‌ర‌లోనే 100 నోట్ల‌ను కూడా కొత్త సిరీస్‌ను తీసుకు వ‌చ్చే ప్లాన్ చేసింది. జ‌న‌వ‌రి 1నాటికి మార్కెట్‌లో కొత్త 500, 1000 నోట్లు పూర్తిగా చెలామ‌ణీలోకి వ‌స్తాయి. కావున‌, 100 నోట్ల‌ను తెచ్చేందుకు ప్ర‌ణాళిక సిద్ధం చేస్తున్నారని స‌మాచారం. సో… మ‌రోసారి షాక్‌కి రెడీగా ఉండండి.

Loading...

Leave a Reply

*