షాకింగ్.. కాస్త త‌గ్గిన‌ మోదీ స‌ర్కార్‌.. పాత‌నోట్ల‌పై కీల‌క నిర్ణయం..!

untitled-6-copy

చేతిలో ఉన్న పాత నోట్లు ప‌నికి రావ‌డం లేదు. కొత్త నోట్లు చేతికి రాలేదు. దీంతో, సామాన్య ప్ర‌జ‌లు అష్ట‌క‌ష్టాలు ప‌డుతున్నారు. వారి క‌ష్టాలు మామూలుగా లేవు. ఓర‌కంగా చెప్పాలంటే సామాన్య ప్ర‌జ‌ల‌కు ఇది ఓ పెద్ద ప్ర‌స‌హ‌నంలా మారింది. మోదీ తీసుకున్న ఓ నిర్ణయం కోసం దేశ ప్ర‌జలు మొద‌ట ఆయ‌నకు సంఘీభావం ప్ర‌క‌టించారు. కానీ, ఇది ఇప్పుడు వారి స‌హ‌నానికి ప‌రీక్ష పెడుతోంది.అందుకే, ఓ వైపు కొత్త నోట్ల‌ను జారీ చేస్తూనే ఇటు పాత నోట్ల‌పై కేంద్రం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. పాత పెద్ద నోట్ల‌ను ఇక‌పై పూర్తిగా వాడుక‌లోనుంచి నిషేధించాల‌ని భావించిన మోదీ స‌ర్కార్‌… వాటిని బ్యాంక్‌ల‌లో డిపాజిట్ చెయ్యాల‌ని ఆదేశాలు జారీచేసింది.

కానీ, బ్యాంక్‌ల ద‌గ్గ‌ర భారీగా క్యూ లైన్‌లు ఉండడంతో ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. ప్ర‌భుత్వ సేవ‌ల‌యిన పౌర సేవ‌ల‌కు పాత‌నోట్ల‌ను చెల్లించేందుకు మ‌రో ప‌ది రోజులు గ‌డువు పొడిగించింది మోదీ ప్ర‌భుత్వం. ప్ర‌భుత్వ ప‌న్నులు, రైల్వేలు, ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల‌లో పాత నోట్ల‌ను ఉప‌యోగించుకోవ‌చ్చంటూ ఆదేశాలు జారీ చేసింది. దీనిని ఎయిర్ పోర్ట్‌లు, బ‌స్ స్టేష‌న్‌లు, పెట్రోల్ బంకుల‌కు కూడా విస్త‌రించింది. ఇది కాస్త ఊర‌ట క‌లిగించే విష‌య‌మే. ఈ నిర్ణ‌యంతో సామాన్య ప్ర‌జ‌ల‌కు కాస్త ఊర‌ట క‌లిగే విష‌య‌మే. వీటితో చేతిలో ఉన్న పాత నోట్లు కొంత మేర త‌గ్గే సూచ‌న‌లు కనిపిస్తున్నాయి. ప్ర‌భుత్వంపైనా కాస్త ఆగ్ర‌హం కూడా త‌గ్గ‌నుంది. అందుకే, ఈ ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్లు.

Loading...

Leave a Reply

*