మిర్చి తింటే ఆ శ‌క్తి పెరుగుతుంది

mirchi

మిర్చి తింటే… ముస‌లిత‌నంతో కుర్చీలో కూల‌బ‌డి కూర్చున్న‌వాడు కూడా లేచి కుర్ర‌దాని వెంట ప‌డ‌తాట్ట‌… కుర్ర‌దానా ఓసీ కుర్ర‌దానా అంటూ వేడెక్కిపోయి పాట‌లు పాడ‌తాట్ట‌…. మిర్చి బాగా తినే మ‌గాళ్లు మిరామిరా కోర‌మీసం మెలేసి మ‌గువ‌ల వెంట ప‌డ‌డం ఖాయంట‌… మిర్చి తింటే ఆ శ‌క్తే కాదు.. ఆస‌క్తి కూడా పెరుగుతుంది…. మిర‌ప‌కాయల‌తో సెక్స్ సామ‌ర్థ్యం పెరుగుతుందిట‌… హాట్ చిల్లీస్ తింటే సిల్లీ ఫెలో కూడా నాటు ఘాటు స‌ర‌సాల‌కు సై అంటాట్ట‌… అందుక‌నే మ‌న వంట‌కాల్లో మిర్చికి ఎంతో ప్రాధాన్య‌త ఉంటుంది… పెద్ద‌వాళ్లు ఎంతో ఆలోచించే మిర్చికి పెద్ద‌పీట వేశారు…. మ‌న‌ద‌గ్గ‌ర మిర్చి లేని వంట‌కం అంటూ ఉండ‌దు… వంట‌ల్లో మంట పుట్టించే మిర్చి వేస్తే బెడ్‌రూమ్‌లోకి వెళ్లాక బాడీలో మ‌న్మ‌థ మంట‌లు లేస్తాయి…

స‌ర‌సాల సెగ‌లు పెరుగుతాయి… వంట‌ల్లో రుచిని పెంచే మిర్చి లైంగిక సామ‌ర్థ్యాన్ని బాగా పెంచుతుందిట‌… ఎంత మిర్చి కారం తింటే ఆలుమ‌గ‌ల మ‌ధ్య అంత మ‌మ‌కారం పెరుగుతుంది.. ఇవి వెట‌కారంతో చెబుతున్న మాటలు కావు… అధ్య‌య‌నాలు తేల్చిన అస‌లు నిజాలు ఇవి… వంట‌ల్లో ఎంత కారం కూరితే దాంప‌త్య జీవితంలో అంత అనురాగం చిగురిస్తుంది… వంట‌ల్లో మిర్చికారం ఎంత ఉంటే సంసారం అంత బాగుంటుంద‌న్న‌మాట‌….సో మిర్చి మ‌సాలా న‌సాలానికి అంటితే స‌ర‌సాల స్వ‌ర్గానికి సెంటిమీట‌ర్ దూరంలో ఉంటారు… అందుక‌నే మ‌న‌వాళ్లు ఉప్పుకారం తింటున్న శ‌రీరం క‌దా అని ముక్తాయింపు ఇస్తూ ఉంటారు…

మిర్చి కారంతో సెక్స్ సామ‌ర్థ్యం ఎలా పెరుగుతుందో శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు.. కారం ఎక్కువైతే నోరు మండుతుంది… దీంతో శ్వాస‌క్రియ వేగం పెరుగుతుంది…ఆ స‌మ‌యంలో గుండె వేగంగా కొట్టుకుంటుంది…శ‌రీరానికి చెమ‌ట‌లు ప‌డ‌తాయి… ఈ ల‌క్ష‌ణాల‌న్నీ సెక్స్‌లో పాల్గొన్న‌ప్పుడు క‌లిగేవే…మిర‌ప‌కాయ‌లో ఉండే కాప్సియాసిన్ శ‌రీరంలో ఇలాంటి మార్పులు తెస్తుందిట‌..దీనివ‌ల్ల స్త్రీ పురుషుల మ‌ర్మాంగాల ద‌గ్గ‌ర ఒక ర‌క‌మైన అల‌జ‌డి రేగుతుంది… ఈ అల‌జ‌డే సెక్స్‌ను ప్రేరేపిస్తుంది… సో ఎంత కారం తింటే కాపురం అంత బాగుంటుంద‌న్న‌మాట‌.

Loading...

Leave a Reply

*