మ‌హేష్ విల‌న్‌.. ఆమెకు అస‌భ్య‌క‌ర మెస్సేజ్‌, ఫోటోలు పెట్టాడ‌ట‌. అరెస్ట్ చేసి బొక్క‌లో వేశారు..!

untitled-12-copy

ఇత‌డిని గుర్తుప‌ట్టారా..? బాగా చూడండి.. అవును, దూకుడులో విల‌న్‌. మ‌హేష్ ట‌ర్కీలో ప‌ట్టుకొని ఇండియాకి తీసుకువ‌చ్చేది ఇత‌డినే. ఈ విల‌న్ పేరు ఎజాజ్ ఖాన్‌. రీసెంట్‌గా ముంబైలో ఇత‌డిపై ఓ కంప్ల‌యింట్ ఫైల్ చేసింది ఓ యువ‌తి. త‌న‌కు అస‌భ్య‌క‌ర మెస్సేజ్‌లు, ఫోటోలు పంపుతున్నాడంటూ ఆయ‌న‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. ఎంక్వ‌యిరీ చేసిన పోలీసులు ఎజాజ్ ఖాన్‌ని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఆ త‌ర్వాత బెయిల్‌పై విడిచిపెట్టారు.మ‌ల్వానీ అనే మ‌హిళ‌కి ఎజాజ్‌ ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. ఆమె కూడా ఓకే చేసింది. ఇద్ద‌రి మ‌ధ్య చాటింగ్ మొద‌ల‌యింది. ఆ తర‌వాత అదే అనుబంధంగా మారింది.

బొటీక్ నిర్వ‌హిస్తున్న ఆమెకు కొంత డ‌బ్బు అవ‌స‌రం అయింది. దీంతో, మ‌నీ అడ‌గ్గా త‌న‌ను క‌ల‌వ‌మ‌న్నాడు. ఆయ‌న ఇచ్చిన అడ్ర‌స్‌కు వెళ్ల‌గా.. అక్క‌డ షూటింగ్ జ‌రుగుతుండ‌డంతో వెన‌క్కి వ‌చ్చింది మ‌ల్వానీ. ఆ త‌ర్వాత వ‌చ్చి మ‌నీ క‌లెక్ట్ చేసుకోమ‌ని ఎజాజ్ చెప్ప‌గా.. వ‌ద్ద‌ని చెప్పింద‌ట‌. ఇలా, ఫోన్ నెంబ‌ర్‌లు కూడా ఎక్చేంజ్ చేసుకోవ‌డంతో ఇద్ద‌రి మ‌ధ్య వాట్స‌ప్ చాటింగ్ మొద‌ల‌యింది.ఎజాజ్ వాట్స‌ప్ ఫోటో బావుంద‌ని ఆమె కామెంట్ చెయ్య‌గా.. మ‌నోడికి ఏమ‌యిందో ఏమో.. రీల్ లైఫ్‌లో వేసే విల‌న్ రెచ్చిపోయాడ‌ట‌. అంతే, ఆమెకు ఊహించ‌ని అస‌భ్య‌క‌ర సెల్ఫీ ఒక‌టి పంపి ఎలా ఉంద‌ని అడిగాడ‌ట‌.

ఆ తర్వాత నుంచి ఇద్ద‌రి మ‌ధ్య ర‌గ‌డ షురూ అయింది. ఇలాంటి ఫోటోలు ఎందుకు పెట్టావు అని అడిగితే.. న‌చ్చ‌క‌పోతే సారీ అని చెప్పాడ‌ట‌. దీంతో, ఆమె వెంట‌నే పోలీసుల‌కు ఫిర్యాదు చేసి ఎజాజ్‌పై కేసు పెట్టింది. రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ సెల్పీ అస‌భ్య‌క‌రంగా ఉండ‌డంతో ఆయ‌న‌ను అరెస్ట్ చేశారు. దీనిపై ఎజాజ్ వాద‌న మరోలా ఉంది. తానెవరికీ ఫోటోలు పంప‌లేద‌ని, సెల‌బ్రిటీ కావ‌డంతోనే త‌న‌ను టార్గెట్ చేశార‌ని చెబుతున్నాడు. మ‌రి, ఇద్ద‌రిలో ఎవ‌రిది నిజం..?

Loading...

Leave a Reply

*