కొణ‌తాల‌కు విజ‌య‌మ్మ ఫోన్ అందుకేనా?

vijayamma-and-kontala

వైసీపీలో కొన్నాళ్లు క్రియాశీలంగా ప‌నిచేసిన కొణ‌తాల రామ‌కృష్ణ‌కు మ‌ళ్లీ జ‌గ‌న్ నుంచి పిలుపు వ‌చ్చిన‌ట్లు తెలిసింది. వైసీపీకి రాజీనామా చేసిన కొణ‌తాల కొన్నాళ్లుగా రాజ‌కీయంగా సైలెంట్‌గా ఉంటున్నారు. ఉత్త‌రాంధ్ర‌లో ప‌ట్టున్న నాయ‌కునిగా కొణ‌తాల‌కు పేరుంది. అలాంటి నేత పార్టీ వీడ‌డంతో ఈ ప్రాంతంలో వైసీపీకి పెద్ద దెబ్బే త‌గిలింది. కొణ‌తాల కొన్నాళ్ల క్రితం టీడీపీలో చేరేందుకు సిద్ధ‌మైనా ఆ ప్రాంతంలోని టీడీపీ నేత‌లు దాన్ని ముందుకు సాగ‌నీయ‌లేదు. దాంతో ఆయ‌న సైలెంట్ అయిపోయారు. కాగా, మంగ‌ళ‌వారం అనూహ్యంగా వైఎస్ జ‌గ‌న్ త‌ల్లి విజ‌యల‌క్ష్మి స్వ‌యంగా కొణ‌తాల‌కు ఫోన్ చేశారు.

ఈ సంద‌ర్భంగా వారి మ‌ధ్య ఏం జ‌రిగిందో బ‌య‌ట‌కు తెలియ‌క‌పోయినా… కొణ‌తాల‌ను తిరిగి పార్టీలోకి రావాల్సిందిగా ఆమె కోరిన‌ట్లు మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే, కొణ‌తాల భార్య అనారోగ్యం పాలై ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ ప‌రిస్తితి విష‌మించి మ‌ర‌ణించారు. దీంతో కొణ‌తాల‌కు ఫోన్ చేసిన జ‌గ‌న్ ఆయ‌న్ను ప‌రామ‌ర్శించారు. ఆ త‌ర్వాత వైఎస్ విజ‌య‌ల‌క్ష్మి కూడా కొణ‌తాల‌కు ఫోన్ చేసి ప‌రామ‌ర్శించారు. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఉన్న‌ప్ప‌టి నుంచి ఆయ‌న కుటుంబానికి కొణ‌తాల స‌న్నిహితునిగా ఉన్న సంగ‌తి తెలిసిందే.

Loading...

Leave a Reply

*