పాక్ పార్ల‌మెంటును షేక్ చేసిన కోహ్లీ దండు

ko

విరాట్ కోహ్లీ … టీమిండియా కెప్టెన్‌… ఇప్పుడు విజ‌యాల బాట‌లో న‌డుస్తున్నాడు…. క్రికెట్‌లో విరాట్ రూపం చూపించే కోహ్లీ ఇప్పుడు త‌న విరాట్ రూపంతో పాక్‌ను కూడా షేక్ చేస్తున్నాడు… తాజాగా పాకిస్తాన్ పార్ల‌మెంటును కోహ్లీ దండు షేక్ చేసేసింది…. కోహ్లీ దండు దాడికి పాక్ పార్ల‌మెంటులో మంట‌లు పుట్టాయి… వాళ్ల‌కు మెంట‌ల్ తెప్పించాయి…. అయితే కోహ్లీ దండు పాక్ పార్ల‌మెంటుపై గ‌న్నుల‌తో దాడి చేయ‌లేదు… బ్యాట్ల‌తో దాడి చేసి కేక పుట్టించింది…. అస‌లు విష‌యం ఏంటంటే పాకిస్తాన్ క్రికెట్ టీమ్ టెస్టుమ్యాచ్‌లో వ‌ర‌ల్డ్ నెంబ‌ర్ వ‌న్ ర్యాంక్‌ని సాధించిం ద‌ని పాక్ పార్ల‌మెంటులో తీర్మానం చేసి పాక్ టీమ్‌ను అభినందించారు… పాక్ టీమ్ ఆహా ఓహో అంటూ అక్క‌డి పార్ల‌మెంటు స‌భ్యులు చంక‌లు గుద్దుకున్నారు…. పాక్ టీమ్‌ గ్రేట్ అంటూ అక్క‌డి పార్ల‌మెంటు తెగ పొగిడేసింది..

ఇది జ‌రిగిన అర‌గంట‌కే రెండో టెస్టులో కూడా న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన భార‌త్ టెస్టు ర్యాంకింగ్స్‌లో వ‌ర‌ల్డ్ నెంబ‌ర్ వ‌న్ అయింది… అంత‌కుముందు నెంబ‌ర్ వ‌న్‌గా ఉన్న పాక్‌ని షేక్ చేసి ప‌డ‌గొట్టి భార‌త్ నెంబ‌ర్ వ‌న్ స్థానానికి చేరుకుంది… దీంతో పాకిస్తానీల‌కు ఫ్యూజులు ఎగిరిపోయాయి… కోహ్లీ దండు దెబ్బ‌కు పాక్ పార్ల‌మెంటుకు దిమ్మ తిరిగి అబ్బా అంది… ఉరీ ఉగ్రవాది దాడి త‌ర్వాత పాక్‌లోకి చొచ్చుకువెళ్లి అక్క‌డి ఉగ్ర‌వాదుల‌తో పాటు సైనికుల‌ను కూడా ఏరిపారేసింది భార‌త్‌… ఇండియా చేసిన స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్‌తో పాక్ షాక్ అయి బ్రేక్ అయిపోయింది… ఈ నేప‌థ్యంలో కోహ్లీ సేన కూడా క్రికెట్‌లో స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ చేసి పాక్‌ని షేక్ చేసి పారేసింది…. పాక్ నుంచి వ‌ర‌ల్డ్ నెంబ‌ర్ వ‌న్ ర్యాంక్‌ని కోహ్లీ సేన లాక్కునేస‌రికి ఆ దేశానికి దిమ్మ తిరిగింది… భారత సైనికులే కాదు కోహ్లీ సేన కూడా త‌మ‌కు షాక్ ఇచ్చింద‌ని పాక్ భోరుమంటోంది.

Loading...

Leave a Reply

*