ప‌ప్పుబెల్లాల్లా పంచేస్తున్న కేసీఆర్‌

kcr

కేసీఆర్‌లో ద‌యాగుణం ఎక్కువై పోయింది. ఆయ‌న‌లోని దాన‌క‌ర్ణుడు నిద్ర లేచారు. ఇంకేముంది అడిగినోడికి అడిగిన‌ట్లు ఇచ్చేద్దాం అంటున్నారు. అయితే, ఆయ‌న పంచుతున్న‌ది సొంత ఆస్తులు కాదు. కొత్త జిల్లాల ఏర్పాటు ఇప్పుడు ప‌ప్పు బెల్లాల్లా పంపిణీని త‌ల‌పిస్తోంది. జిల్లాల ఏర్పాటుతో పాల‌న సులువ‌వుతుంద‌ని, కిందిస్థాయి ప్ర‌జ‌లు సంక్షేమ ఫ‌లాల‌ను తీసుకెళ్ల‌డం సుల‌భం అవుతుంద‌ని కేసీఆర్ చెబుతున్నారు. ఆ క్ర‌మంలోనే 17 కొత్త జిల్లాలు ఏర్పాటు స‌మ‌జంస‌మ‌ని ఆయ‌న తొలుత భావించారు.

అయితే, తమ‌కూ ఓ జిల్లా కావాలంటూ చాలా ప్రాంతాల్లో ఆందోళ‌న‌లు మొద‌ల‌య్యాయి. తొలుత గ‌ట్టిగానే వాటిని తిర‌స్క‌రించిన కేసీఆర్ ప్ర‌క్రియ చివ‌రి ద‌శ‌కు వ‌చ్చేస‌రికి మెత్త‌బ‌డ్డారు. తొలుత త‌న కుమారుడు అడిగిన సిరిసిల్ల జిల్లా ఏర్పాటుకు కూడా కేసీఆర్ స‌సేమీరా అన్నారు. కానీ తాజాగా కుమారుడి కోరికతోపాటు, కాంగ్రెస్ నేత‌లు కోరుతున్న గ‌ద్వాల‌, జ‌నం కోరుతున్న జ‌న‌గామ వంటి జిల్లాల‌కు కూడా స‌రేన‌న్నారు. ఎందుకు ఇదంతా అంటే కేసీఆర్ చెప్పిన స‌మాధానం విచిత్రంగా ఉంది. పండ‌గపూట ప్ర‌జ‌లు సంతోషంగా ఉండాలి.

నేనేదో చేశాన‌ని వారి కోరిక‌కు అడ్డుప‌డ్డాన‌ని న‌న్నేందుకు తిట్టుకోవాల‌ని అడిగినోడికి అడిగిన‌ట్లు జిల్లాలు ఇచ్చేద్దాం అని వ్యాఖ్యానించారు. దాంతో 17 కాస్తా 20 కొత్త జిల్లాలు అయ్యాయి. ఇప్పుడు ఆ 20 కూడా ఇంకా పెరిగే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. అంటే తెలంగాణలో మొత్తం 30 లేక 32 జిల్లాలు ఏర్ప‌డే అవ‌కాశం క‌నిపిస్తోంది. మ‌రి ఇదే కేసీఆర్ ప్ర‌జ‌లు చేస్తున్న ఇత‌ర డిమాండ్‌ల విష‌యంలోనూ ఇదే దాన‌శీల‌త ప్ర‌ద‌ర్శించ‌వ‌చ్చు క‌దా అన్న‌ది చాలామంది ధ‌ర్మ‌సందేహం

Loading...

Leave a Reply

*