మ‌నిషికి 3ల‌క్ష‌లు పంచిన క‌ర్నాట‌క ఎమ్మెల్యే….!

money1

మోదీ ప్ర‌క‌టించిన నిర్ణ‌యం.. ఒక్క‌సారిగా న‌ల్ల కుబేరుల గుండెల్లో ఫిరంగిలా మోగుతోంది. పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేస్తూ ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యం ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. అందుకే, క‌ర్నాట‌క రాష్ట్రంలోని కోలార్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ఎమ్మెల్యే.. త‌న ద‌గ్గ‌ర మూలుగుతున్న కోటాను కోట్ల డ‌బ్బును చాలామందికి పంచి పెట్టాడ‌ట‌. ఒక్కొక్క‌రికి సుమారు 3ల‌క్ష‌ల రూపాయ‌లు పంచి పెట్టాడ‌ట‌. దీంతో, ఆ డ‌బ్బును తీసుకునేందుకు జ‌నాలు క్యూ క‌ట్టారు. ఫోటోలో ఈ స్టిల్ చూడండి.. డ‌బ్బును ఎలా గుట్ట‌లుగా పెట్టి పంచుతున్నాడో…! దానిని బ‌ట్టే అర్ధం చేసుకోవ‌చ్చు.. ఆయ‌న ద‌గ్గ‌ర ఏ రేంజ్‌లో బ్లాక్ మ‌నీ ఉందో..

కోలార్ అంటే బంగారం గ‌నుల‌కు బాగా ఫేమస్‌. అక్క‌డ స‌హ‌జ వ‌న‌రులు చాలా ఎక్కువ‌. మైనింగ్‌కి కూడా అడ్ర‌స్ కోలార్‌. ఇలా వేల కోట్ల రూపాయ‌లను మైనింగ్‌లో ద‌క్కించుకున్న ఆయ‌న మోదీ నిర్ణ‌యంతో స‌డెన్‌గా త‌న ద‌గ్గ‌రున్న కోటాను కోట్ల‌ను పంచి పెడుతున్నాడ‌ట‌. అయితే, దీనిని లోన్ పేరిట ఇస్తున్నాడ‌ట‌. ఏవో కాగితాలు రాయించుకొని వాటిని ఇస్తున్నాడ‌ట‌. అంటే, ఆ త‌ర్వాత వారి ద‌గ్గ‌ర‌నుంచి ల‌క్ష రూపాయ‌లు వ‌చ్చినా చాల‌ని ఆయ‌న అంచ‌నా వేసుకుంటున్నాడ‌ని స‌మాచారం.

ఇలా అయితే త‌న ద‌గ్గ‌రున్న బ్లాక్ మ‌నీలో చాలా వ‌ర‌కు వైట్‌గా మారుతుంద‌ని భావించాడు స‌ద‌రు ఎమ్మెల్యే. అందుకే, న‌డిరోడ్డుపై లోన్ మేళా ఏర్పాటు చేశాడు.అయితే, ఈ డ‌బ్బును బ్యాంక్‌లో వేసుకొని కొన్నాళ్ల త‌ర్వాత చెల్లించ‌మ‌ని అడిగాడ‌ట‌. ఇందులో ఎంత‌వ‌ర‌కు నిజ‌మో కానీ.. ఈ ఫోటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీనిపై అధికారులు కూడా దృష్టి సారించార‌ట‌. ఇలా ఓపెన్‌గా లోన్ మేళా పెడితే ఎవ‌ర‌యినా ఏం చేస్తారు..?

 

Loading...

Leave a Reply

*