ప్ర‌భాస్‌, ఎన్టీఆర్‌, మ‌హేష్‌కాదు… గాలి కూతురు పెళ్లిలో అత‌డే హైలైట్ అట‌..!

gali

గాలి జ‌నార్ధ‌న్ రెడ్డి… మైనింగ్ మాఫియా లీడ‌ర్. క‌ర్నాట‌క రాజ‌కీయాల‌ను సైతం శాసించిన గ‌నుల కింగ్‌. ఆయ‌న చేసిన అరాచ‌కాల‌కు అంతే లేకుండా పోవ‌డంతో సీబీఐ విచార‌ణ ఎదుర్కొంటున్నాడు. అయితే, ఆయ‌న త‌న ఒక్క‌గానొక్క కూతురి పెళ్లిని ఘ‌నంగా నిర్వ‌హించేందుకు స‌మాయ‌త్త‌మ‌వుతున్నాడు. ఇప్ప‌టికే వెడ్డింగ్ కార్డ్‌తోనే దేశం మొత్తమ్మీద, ఈ పెళ్లి హ‌డావిడి మార్మోగిపోతోంది.గాలి జ‌నార్ద‌న్ రెడ్డి కూతురి వివాహానికి తెలుగు, త‌మిళ్‌, హిందీ నుంచి ఎందరో సెల‌బ్రిటీలు విచ్చేయ‌డానికి సిద్ధంగా ఉన్నార‌ట‌. ఇటు, క‌త్రిన కైఫ్‌, త‌మ‌న్న వంటి భామ‌లు అక్క‌డ కాసేపు డ్యాన్స్ షో చేస్తే కోట్ల రూపాయ‌లు గుమ్మ‌రించ‌డానికి ఆయ‌న రెడీగా ఉన్నాడ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇక‌, షారుక్ ఖాన్ లాంటి లీడింగ్ బాలీవుడ్ హీరోకి ఏకంగా పెళ్లికి అలా వ‌చ్చి ఇలా వెళ్లిపోతే ఏకంగా 4 కోట్లు ఇవ్వ‌డానికి సిద్ధ‌మనే రూమ‌ర్ వినిపించింది. ఇక‌, టాలీవుడ్‌లోనూ ప‌లువురు బ‌డా హీరోలు ఈ మ్యారేజ్‌కి అటెండ్ అవ‌నున్నార‌నే టాక్ జోరుగాసాగుతోంది. మ‌హేష్‌, ప్ర‌భాస్‌, ఎన్టీఆర్ వంటి హీరోలకి ఇప్ప‌టికే ఇన్విటేష‌న్‌లు అందాయ‌ని, మ్యారేజ్‌కి వెళితే వారికి కూడా పెద్ద ఎత్తున గిఫ్ట్‌లు ఇవ్వ‌బోతున్నార‌నే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.వీట‌న్నింటినీ ప‌క్క‌న‌పెడితే.. గాలి కూతురు పెళ్లికి వీరెవ‌రూ చీఫ్ గెస్ట్‌లు కాద‌ట‌. ఆయన మ్యారేజ్‌కి క‌న్న‌డ సూప‌ర్‌స్టార్ ఉపేంద్ర‌నే ముఖ్య అతిథి అని భావిస్తున్నార‌ట‌.

శాండ‌ల్‌వుడ్‌లో రియ‌ల్‌స్టార్ ఉపేంద్ర‌కు ఉన్న క్రేజ్ స్పెష‌ల్‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. అందుకే, బెంగ‌ళూరులో జ‌ర‌గ‌నున్న ఈ మ్యారేజ్‌కి ఆయ‌నే హైలైట్ అవుతాడ‌ని భావిస్తున్నారు. గతంలో ఉపేంద్ర గాలి జ‌నార్ద‌న్ రెడ్డి గ‌నుల మాఫియా బాగోతంపై సినిమా తీశాడు. తెలుగులో ప‌వ‌న్‌లానే క‌న్న‌డ‌లో ఉపేంద్ర‌కి కూడా కొన్ని ప్రిన్సిపుల్స్ ఉన్న వ్య‌క్తిగా చెప్పుకుంటారు. దీంతో, ఉపేంద్ర వ‌స్తే స్పెష‌ల్‌గా మారుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇటు, గాలి జ‌నార్ద‌న్ రెడ్డి ఉపేంద్ర ఇంటికి వెళ్లి మ‌రీ కార్డ్‌ను ఇచ్చి వ‌చ్చాడ‌ట‌. మ‌రి, ఉపేంద్ర వ‌స్తాడా? రాడా? అనేది సస్పెన్స్‌గా మారింది.

Loading...

Leave a Reply

*