జియో దెబ్బ‌కు ఎయిర్‌టెల్, ఐడియా అబ్బా

untitled-14

జియో సంచ‌ల‌నం అంతా ఇంతా కాదు. రిల‌య‌న్స్ జియో ఆఫ‌ర్ సునామీలో మిగిలిన దిగ్గ‌జ సెల్యులాయిడ్ కంపెనీల‌న్నీ కొట్టుకుపోతున్నాయి. దానికి తోడు ఇప్పుడు ఆ సంస్థ‌ల‌పై ట్రాయ్ పిడుగు ప‌డింది. జియోను ఇబ్బంది పెడుతున్నందుకు ఎయిర్‌టెల్‌, ఐడియా, వొడాఫోన్ సంస్థ‌ల లైసెన్సులు ర‌ద్దు చేయొచ్చ‌ని కూడా వ్యాఖ్యానించింది. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కూ ఏక‌ఛ‌త్రాధిప‌త్యం సాధించిన ఎయిర్‌టెల్ వంటి సెల్యూలాయిడ్ సంస్థ‌లు వినియోగ‌దారులను ఓ ఆట ఆడుకున్నాయి. చెప్పిందే టారీఫ్‌… ఇచ్చిందే టాక్‌టైమ్ అన్న‌ట్లుగా ఫోన్ కాల్స్ ధ‌ర‌ల‌ను ముక్కుపిండి వ‌సూలు చేశాయి.

అనూహ్యంగా జియో ప్ర‌క‌టించిన ఆఫ‌ర్‌తో ఎయిర్‌టెల్‌; ఐడీయా, వొడాఫోన్ త‌దిత‌ర‌ సంస్థ‌ల పునాదులు క‌దిలే ప‌రిస్థితి వ‌చ్చింది. దాంతో అవ‌న్నీ క‌క్ష‌పూరిత చ‌ర్య‌ల‌కు దిగాయి. జియో వినియోగ‌దారుల‌కు కాల్ క‌నెక్టివిటీని త‌గ్గించాయి. వెర‌సి జియోకు మారిన వినియోగ‌దారులు కాల్స్ క‌ల‌వ‌క నానా ఇబ్బందులు ప‌డుతున్నారు. దానిపై జియో ట్రాయ్‌ను ఆశ్ర‌యించింది. ఈ ఫిర్యాదుపై విచార‌ణ జ‌రిపిన ట్రాయ్… ఉద్దేశ‌పూర్వ‌కంగానే ఈ సంస్థ‌లు జియో వినియోగ‌దారుల‌ను ఇబ్బంది పెడుతున్నాయ‌ని తేల్చింది. క‌నెక్టివిటీని క‌ల్పించ‌కుండా ఇబ్బంది పెడుతున్న ఎయిర్‌టెల్‌, ఐడియా, వొడాఫోన్ల‌కు రూ.3,050 కోట్ల జరిమానా విధించాలని టెలికం శాఖకు సిఫార్సు చేసింది.

లైసెన్సు నిబంధ‌న‌లు, సేవల నాణ్యతా ష‌ర‌తుల‌ను ఈ మూడు కంపెనీలు పాటించడం లేదని ట్రాయ్ తేల్చి చెప్పింది. జియోకు పోర్టులు కేటాయించేందుకు ఈ కంపెనీలు తిరస్కరించడం వినియోగదారులకు వ్యతిరేక‌మేన‌ని ట్రాయ్ వెల్ల‌డించింది. వీటిని దృష్టిలో ఉంచుకొని ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌కు ఒక్కొక్క కంపెనీకి 1,050 కోట్ల రూపాయల చొప్పున, ఐడియాకు 950 కోట్ల రూపాయల చొప్పున జరిమానా విధించాలని సిఫార్సు చేసింది. ఎయిర్‌టెల్ మాత్రం తాము పోర్టుల కేటాయింపులు గ‌తంలో క‌న్నా మెరుగ్గా క‌ల్పిస్తున్నామ‌ని చెబుతోంది.

Loading...

Leave a Reply

*