నెల రోజుల్లో ప్ర‌పంచ రికార్డు నెల‌కొల్పిన జియో

jio-creates-new-world-record-in-customers-base

ఇండియ‌న్ టెలికం రంగంలోకి తుఫాన్‌లా దూసుకువ‌చ్చిన ముఖేష్ అంబానీ రిల‌య‌న్స్ జియోకు జ‌నం జ‌య‌హో అన్నారు… ఫ్రీ కాల్స్, ఫ్రీ డేటా అంటూ మార్కెట్‌లో ఫీవ‌ర్ తెప్పించింది…. జియో జ్వ‌రంతో జ‌నం ఊగిపోయారు… ఎగ‌బ‌డి జియో సిమ్ములు కొనేశారు…ఇతర నెట్‌వ‌ర్క్‌ల అధిక‌రేట్ల దాదాగిరిని త‌న డేటాగిరితో బ‌ద్ద‌లు కొట్టింది జియో… దీంతో జియోకు జైజై అన్న జ‌నం… ఇతర నెట్‌వ‌ర్క్‌లకు బైబై అన్నారు… జియో ప్ర‌భంజ‌నంలో ఇత‌ర నెట్‌వ‌ర్క్‌లు కొట్టుకుపోయాయి..

నెల రోజులు.. 30 రోజులు.. జస్ట్ వ‌న్ మంత్‌లో ప్ర‌పంచ రికార్డులు తిర‌గ‌రాసింది జియో… అంచ‌నాల‌కు మించి యూజ‌ర్ల‌ను సంపాదించింది… కేవ‌లం 30 రోజుల్లోనే 16 మిలియ‌న్లు అంటే కోటి 60 ల‌క్ష‌ల‌మంది స‌బ్‌స్ర్కైబ‌ర్ల‌ను సొంతం చేసుకుని జియో ప్ర‌పంచ రికార్డు నెల‌కొల్పింది.. ప్ర‌పంచంలో మ‌రే ఇత‌ర నెట్‌వ‌ర్క్ కూడా ఇంత త‌క్కువ స‌మ‌యంలో ఇంత‌మంది క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ట్టుకోలేదు.. ఇప్పుడు జియో వెంట జ‌నం న‌డుస్తూ జ‌య‌హో అంటున్నారు… ఫేస్‌బుక్‌, వాట్స‌ప్‌, స్కైప్ లాంటి సోష‌ల్ మీడియా నెట్‌వ‌ర్కులు కూడా ఇంత త‌క్కువ సమ‌యంలో ఈ స్థాయిలో యూజ‌ర్ల‌ను న‌మోదు చేసుకోలేక‌పోయాయ‌ని, తాము మాత్రం ఈ ఘ‌న‌త సాధించామ‌ని రిల‌య‌న్స్ జియో ఇన్ఫోకామ్ ఓ ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది…

ప్ర‌తి భార‌తీయుడికి ఇంట‌ర్నెట్ డేటా అందుబాటులోకి తీసుకురావ‌డ‌మే త‌న ఉద్దేశ‌మ‌ని ముఖేష్ అంబానీ అంటున్నారు… జియోకు దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌ల నుంచి భారీ స్పంద‌న వ‌చ్చింద‌ని, క‌స్ట‌మ‌ర్ల కోసం తాము అందిస్తున్న సేవ‌ల‌కు త‌గిన గుర్తింపు ల‌భించిందంటూ ముఖేష్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు… అస‌లు జియో ఫ్రీ కాల్స్‌, ఫ్రీ డేటా అంటూ కొట్టిన దెబ్బ‌కు ఇత‌ర నెట్‌వ‌ర్క్‌లు కూడా దిగివ‌చ్చి జ‌నానికి ఆఫ‌ర్లు ప్ర‌క‌టించాయి… ఇప్పుడు దేశంలో అతి సామాన్యుడు కూడా ఇంట‌ర్‌నెట్ వినియోగిస్తున్నాడంటే ఆ ఘ‌న‌త నిస్సందేహంగా ముఖేష్ అంబానీదే అని చెప్పొచ్చు.

Loading...

Leave a Reply

*