నోట్ల సంక్షోభంలోనూ జియో మ‌రో సంచ‌ల‌నం

untitled-1

జియో సిమ్‌తో… వాయిస్ కాల్స్ ఫ్రీ… 4జీ నెట్ బ్రౌజింగ్ ఉచితం… ఇప్పుడు డీటీహెచ్ విభాగంలో అతి త‌క్కువ ధ‌ర‌ల‌కే అత్యుత్త‌మ సేవ‌లంటూ వార్త‌లు… ఇక ఇప్పుడు తాజాగా ఇంట‌ర్నెట్ రంగంలో మ‌రో సంచ‌ల‌నం. ఒక‌వైపు దేశంలో నోట్ల సంక్షోభం తీవ్ర స్థాయిలో ఉన్నా… మ‌రోవైపు రిల‌య‌న్స్ జియో మాత్రం ప్ర‌త్యేక ఆఫ‌ర్ల‌తో చెరేగిపోతుంది. ఎంత‌కి తెగించి అయినా స‌రే… ఎంత వ్య‌యం చేసైనా సరే జియోను దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ చేయాల‌ని రిల‌య‌న్స్ అధినేత ముఖేశ్ అంబానీ ఉన్న‌ట్లున్నారు. ఆ క్ర‌మంలోనే ఇప్పుడు జియో క‌న్ను ఇంట‌ర్నెట్ సేవ‌ల‌పై ప‌డింది. కేవలం 500 రూపాయ‌ల‌కే 600 జీబీ డేటాను ఇచ్చే సంచ‌ల‌న ఆఫ‌ర్‌కు త్వ‌ర‌లో శ్రీ‌కారం చుట్ట‌బోతున్న‌ట్లు జియో ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు కంపెనీ వ‌ర్గాల నుంచి మీడియాకు స‌మాచారం లీకైంది.

ఇలా అందించే ఇంట‌ర్నెట్ స్పీడ్‌కూడా 120 ఎంబీపీఎస్ నుంచి 1జీబీ వ‌ర‌కూ ఉంటుంద‌ని కంపెని చెబుతోంది. జియో గిగా ఫైబ‌ర్ స్పెష‌ల్ ఆఫ‌ర్ ప్లాన్‌తో ఈ ప్ర‌త్యేక బ్రాడ్‌బ్యాండ్ సేవ‌ల‌ను వినియోగ‌దారుల‌కు అందుబాటులోకి తేవాల‌ని జియో నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది. దీనికి సంబంద‌ఙంఇచ‌న పూర్తి స‌మాచారాన్ని జియోకేర్‌.నెట్‌లో అందుబాటులో ఉంచింది. జియో గిగాఫైబర్ బ్రాడ్‌బాండ్ వెల్‌కమ్ ఆఫర్‌లో భాగంగా వెల్‌కమ్ ఆఫర్‌ను కంపెనీ ప్రకటించింది. ఈ వెల్‌కమ్ ఆఫర్‌లో భాగంగా 3 నెలలు అపరిమిత ఇంటర్నెట్ సేవలను అందించనుంది. ముంబై, పూణెలో ఇప్పటికే జియో ఫైబర్ బ్రాడ్‌బాండ్ సర్వీస్ అందుబాటులో ఉందని, త్వరలో దేశవ్యాప్తంగా ఈ సేవలను ప్రవేశపెట్టబోతున్నామని కంపెనీ ప్రకటించింది. టెలికాం రంగంలో దిగ్గ‌జ కంపెనీల‌కు వెన్నులో వ‌ణుకు పుట్టించిన జియో ఇప్పుడు బ్రాడ్‌బ్యాండ్ సేవ‌ల విష‌యంలోనూ అదే దూకుడు ప్ర‌ద‌ర్శించి ప్ర‌త్య‌ర్థి కంపెనీల‌ను కోలుకోనీయ‌కుండా దెబ్బ కొట్ట‌డానికి సిద్ధ‌మైంది.

Loading...

Leave a Reply

*