బాబు టీవీ షో చేశారా?… అది జ‌గ‌న్ చూశారా?

jacha

ఏపీ సీఎం చంద్ర‌బాబు టీవీ చాన‌ళ్ల షో కోస‌మే ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నార‌ని జ‌గ‌న్ ఆరోపించారు. రాష్ట్రంలోని ప్ర‌ధాన జిల్లాలు భారీ వ‌ర్షాల‌తో అతలాకుత‌లం అవుతుంటే చంద్ర‌బాబు మాత్రం షో కోసం అలా వ‌చ్చి ఇలా వెళ్లిపోయార‌ని విప‌క్ష నేత జ‌గ‌న్ ఆరోపించారు. వ‌ర్షాలు కురిసిన రెండు రోజులు చంద్ర‌బాబు గుంటూరు జిల్లాలోని ప‌లు గ్రామాల‌లో ప‌ర్య‌టించారు. క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్ నుంచి అధికారుల‌ను అప్ర‌మ‌త్తం చేసారు. అలాగే, హెలికాప్ట‌ర్‌లో తిరుగుతూ ఏరియ‌ల్ స‌ర్వే చేశారు. రైతుల పొలాల‌కు వెళ్లి నేనున్నా అంటూ భ‌రోసా నింపే ప్ర‌య‌త్నం చేశారు. చంద్ర‌బాబు ఇలా సుడిగాలి ప‌ర్య‌ట‌న చేస్తుంటే తాను వెన‌క‌బ‌డిపోతానేమోన‌నుకుని జ‌గ‌న్ కూడా రంగంలోకి దిగారు.

హైద‌రాబాద్ నుంచి గుంటూరులో వాలిపోయారు. రెండు రోజులుగా వ‌ర‌ద ప్ర‌భావ ప్రాంతాల‌లో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగానే ప్ర‌భుత్వంపైనా, చంద్ర‌బాబుపైనా విమ‌ర్శ‌లు గుప్పించారు. చంద్ర‌బాబు ప్ర‌జ‌ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, అధికారులు కూడా వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకునేందుకు ముందుకు రావ‌డం లేద‌ని ఒక్క‌రికి కూడా ద‌మ్మిడీ సాయం చేయ‌లేద‌ని విమ‌ర్శించారు. ప్ర‌భుత్వం ఆదుకోని కార‌ణంగా తామే ప్ర‌జ‌ల‌ను ఆదుకునేందుకు ముందుకు వ‌స్తున్నామ‌ని వారికి అవ‌స‌ర‌మైన ఆర్థిక సాయం చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

Loading...

Leave a Reply

*