కొత్త 2వేలు, 500 నోట్ల కోసం ఏటీఎమ్‌లు మ‌ళ్లీ బంద్‌….?

untitled-14

రెండు రోజులు ఏటీఎంలు మూసేస్తున్నాం. ఆ త‌ర్వాత య‌థావిధిగా అవి జ‌నానికి అందుబాటులోకి వ‌స్తాయి. నోట్లు ర‌ద్దు చేస్తూ ప్ర‌ధాని మోడీ.. ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ ఉర్జిత్ ప‌టేల్‌, కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అంద‌రూ చెప్పిన మాట ఇది. రెండు రోజులే క‌దా అని జ‌నం కూడా భ‌రించ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. అయితే, ఆ రెండు రోజుల గ‌డువు ముగిసి ఇప్ప‌టికి మ‌రో మూడు రోజులు గ‌డిచింది. అయినా ప‌రిస్థితిలో ఏ మార్పూ రాలేదు. మూత‌బ‌డ్డ ఏటీఎంలు మూత‌బ‌డిన‌ట్లే ఉన్నాయి.మ‌రో మూడు రోజులు ఇదే ప‌రిస్థితి కొన‌సాగే అవ‌కాశం ఉందనే ప్ర‌చారం షురూ అయింది సోష‌ల్ మీడియాలో.

అర‌కొర‌గా రోజులో ఒక గంట ప‌ని చేస్తున్న ఏటీఎంలు మిగిలిన 24 గంట‌లూ మూత‌బ‌డే ఉంటున్నాయి. దాంతో జ‌నం ప‌నులు మానుకుని డ‌బ్బుల కోసం ఏటీఎంలు ఎప్పుడు తీస్తారా అని ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మీడియా ముందుకు వ‌చ్చిన ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ చావు క‌బురు చ‌ల్ల‌గా చెప్పారు. ఏటీఎం మిష‌న్ల‌లో సాంకేతికంగా మార్పులు చేయాల్సి ఉంద‌ని, నోట్లు ఉంచే బాక్సులు స‌హా చాలా మార్పులు చేయాల్సి ఉంద‌ని అందువ‌ల్ల మ‌రికొంత స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంద‌ని వెల్ల‌డించారు.

అంటే, జై్ట్లీ అధికారికంగా మ‌రో మూడు రోజులు అడిగారంటే అన్ని ఏటీఎంలు పూర్తిగా వినియోగంలోకి రావాలంటే అంత‌కంటే ఎక్కువే స‌మ‌యం ప‌ట్ట‌వ‌చ్చ‌ని తెలుస్తోంది. ఇక‌, మిష‌న్ల‌లో సాంకేతిక‌త‌ను పక్క‌న పెడితే ఇప్పుడు జ‌నానికి అవ‌స‌ర‌మైన వంద నోట్లు కూడా చాలిన‌న్ని లేక‌పోవ‌డం ప్ర‌ధాన స‌మ‌స్య‌. ప‌నిచేస్తున్న ఏటీఎంల‌లో నోట్లు పెడుతున్నా జ‌న‌మంతా ఏటీఎంల ద‌గ్గ‌రే కాపు కాస్తుండ‌డంతో అవి పెట్టిన గంట‌కే ఖాళీ అయిపోతున్నాయి. దీంతో ప‌రిస్థితి తీవ్రంగా మారుతోంది.

Loading...

Leave a Reply

*