ఐపీఎల్ బ్రాండ్ వేల్యూ.. 29 వేల కోట్లు..!

ipl

షాకింగ్‌గా ఉన్న ఇది వాస్త‌వం. ఐపీఎల్ బ్రాండ్ వేల్యూ రోజురోజుకీ అమాంతం పెరుగుతోంది. ప్ర‌స్తుతం అది దాదాపు 29 వేల కోట్ల‌కు చేరింది. త్వ‌ర‌లోనే అది 30 వేల కోట్ల మార్క్‌ను కూడా ఈజీగా దాటుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. క్రికెట్ ప్ర‌పంచంలో కొత్త రికార్డ్ ఇది. బీసీసీఐ స్వయంగా దీనిని ప్ర‌క‌టించ‌డం విశేషం. యూఎస్‌లోని ఆర్ధిక స‌ల‌హా సంస్థ డ‌ఫ్ అండ్ ఫెల్ప్స్ వేసిన అంచ‌నా రిపోర్ట్ ప్ర‌కారం ఐపీఎల్ బ్రాండ్ వేల్యూ ఈ రేంజ్‌లో ఉంటుంద‌ట‌. అంతేకాదు, మేనేజ్‌మెంట్ క‌న్స‌ల్టెన్సీ సంస్థ కెపీఎమ్‌జీ ప్ర‌కారం గ‌తేడాది ఐపీఎల్‌.. భార‌త్ జీడీపీకి 1150 కోట్ల రూపాయ‌ల వాటాని అందించింద‌ట‌. అంటే, ఐపీఎల్ బ్రాండ్ వేల్యూ ఏ రేంజ్‌లో ఉందో అర్ధం చేసుకోవ్చు.

ప్ర‌పంచ క్రికెట్ చ‌రిత్రలో ఓ కొత్త అధ్యాయాన్ని లిఖించింది ఐపీఎల్. ఆట‌గాళ్ల‌కు క‌న‌క వ‌ర్షం కురిపిస్తోంది. కోట్ల రూపాయ‌ల‌ను గుమ్మ‌రిస్తోంది. ప్ర‌పంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న లీగ్ ఇదే. అందుకే, ఐపీఎల్ రేటింగ్ బాగా పెరుగుతోంది. ప్ర‌పంచ వ్యాప్తంగా క్రికెట‌ర్‌ల డిమాండ్ పెంచిన లీగ్ ఇది. అంతేకాదు, దేశంలోని ఎంద‌రో ప్లేయ‌ర్ల‌కు కూడా ఇది బంగారం లాంటి చాన్స్‌ల‌ను అందించింది.2015-16లో 102 కోట్ల మంది ఐపీఎల్‌ను వీక్షించార‌ట‌. ఈ ఇయ‌ర్ ట్రోఫీని దక్కించుకొని విజేత‌గా నిలిచింది మ‌న హైద‌రాబాద్ సన్ రైట‌ర్స్ టీమ్‌. మ‌రోవైపు, టీవీల‌లో కంటే.. ఐపీఎల్‌ని ఎక్కువ‌గా ఆన్‌లైన్‌లోనే ఎక్కువ‌గా వీక్షిస్తున్నార‌ట‌.

డైరెక్ట్‌గా టీవీల‌లో చూసేవారితో పోల్చితే వీరు 62 శాతం అధికమ‌ట‌. ఇక‌, గ్రౌండ్స్‌కి వ‌చ్చి మ్యాచ్‌ని తిలకించిన లిస్ట్ కూడా భారీగానే ఉంది. సుమారు 16ల‌క్ష‌ల మంది ప్రేక్ష‌కులు ఐపీఎల్ 8ని గ్రౌండ్స్‌కి వ‌చ్చి చూశారు. ఇక‌, ఐపీఎల్ ఏర్పాటు చేసిన ఫ్యాన్ పార్క్స్‌కి సుమారు 44ల‌క్ష‌ల మంది ఆడియెన్స్ హాజ‌ర‌య్యారు. మొత్త‌మ్మీద‌, ఐపీఎల్ డిమాండ్ చూస్తుంటే.. రాబోయే రోజుల‌లో దాని బ్రాండ్ వేల్యూ 50 వేల కోట్ల‌కు రీచ్ అయినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన పనిలేదు. ఐపీఎల్ కిక్ అలాంటిది మ‌రి.

Loading...

Leave a Reply

*