విశాఖ టెస్ట్ మ‌న‌దే… రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ ఘోర ప‌రాజ‌యం..!

untitled-16-copy

మొద‌టిటెస్ట్‌లో త‌డ‌బ‌డ్డ టీమ్ ఇండియా.. రెండో టెస్ట్‌లో రెచ్చిపోయింది. ఇంగ్లండ్‌ని మ‌ట్టిక‌రిపించింది. వైజాగ్‌లోని వైఎస్సార్ స్టేడియంలో జ‌రిగిన ఈ టెస్ట్ మ్యాచ్‌లో భార‌త్ అన్ని విభాగాల‌లోనూ రాణించింది. 246 ప‌రుగుల తేడాతో భార‌త్ విజ‌యం సాధించింది. సుమారు 420 ప‌రుగుల టార్గెట్‌తో సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేసిన ఇంగ్లండ్ మొద‌ట కాస్త నిల‌క‌డ‌గా ఆడింది. కానీ, నిన్న సాయంత్రం నుంచే భార‌త్ తురుపుముక్క అశ్విన్ రెచ్చిపోవ‌డంతో భార‌త్ మ్యాచ్‌పై ప‌ట్టు బిగించింది. ఐదో రోజు లంచ్ విరామానికే ఇంగ్లండ్‌ని పెవిలియ‌న్‌కు చేర్చింది. అయిదు టెస్ట్‌ల సిరీస్‌లో 1-0 తేడాతో భార‌త్ ఆధిక్యంలో ఉంది.

భార‌త్‌కి ఇది సూప‌ర్ విక్ట‌రీ. మొద‌టి టెస్ట్‌లో భార‌త్ తడ‌బడింది. కానీ, రెండో టెస్ట్‌లో అద‌ర‌గొట్టింది. అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలో దుమ్ము దులిపింది. భారత స్పిన్న‌ర్‌ల ధాటికి ఇంగ్లండ్ కోలుకోలేక‌పోయింది. ఇక‌, ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్‌మ‌న్ రూట్ కూడా త‌క్కువ ప‌రుగుల‌కే పెవిలియ‌న్ చేర‌డం బాగా క‌లిసొచ్చింది. మొత్తానికి ఈ విజ‌యం భార‌త్‌కి మంచి ఆత్మ‌విశ్వాసాన్ని ఇచ్చింది. ఇదే ఊపుతో మిగిలిన మూడు టెస్ట్‌ల‌లోనూ ఇంగ్లండ్‌ని నిలువరించే స్కెచ్ గీస్తోంది. కోచ్ కుంబ్లే ఇప్ప‌టికే ప‌క్కా ప్ర‌ణాళిక సిద్ధం చేశాడ‌ట‌.

భార‌త్ ఇన్నింగ్స్‌.. 445 & 205
ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌.. 255 & 158

Loading...

Leave a Reply

*