టెస్ట్‌ల‌లో మ‌న‌మే నెం.1.. రెండో టెస్ట్‌లో కివీస్ చిత్తు..!

indian-cricket

టెస్ట్‌ల‌లో భార‌త్ ప్ర‌పంచ అగ్ర‌గామిగా నిలిచింది. గ‌త కొంత‌కాలంగా రెండో స్థానంతోనే సరిపెట్టుకుంటున్న కోహ్లీ సేన‌.. కివీస్‌తో జ‌రుగుతున్న మూడు టెస్ట్‌ల సిరీస్‌ని 2-0తో విజ‌యం సాధించింది. రెండో టెస్ట్‌కే సిరీస్‌ని సొంతం చేసుకుంది. ఇటు, టెస్ట్‌ల‌తో నెంబ‌ర్ వ‌న్ ర్యాంక్‌ని కూడా పొందింది.ఈడెన్ గార్డెన్స్‌లో భార‌త్ చారిత్రాత్మ‌క విజ‌యం ద‌క్కించుకుంది. ఇది ఇండియాకి 250వ టెస్ట్ మ్యాచ్‌. ఈ మ్యాచ్‌ను నాలుగోరోజుకే ఖ‌తం చేసింది. భార‌త్ బౌల‌ర్‌లు కివీస్ భ‌ర‌తం ప‌ట్టారు. 376ప‌రుగుల ల‌క్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ కేవ‌లం 197 ప‌రుగుల‌కు చాప చుట్టేసింది.

కివీస్ బ్యాట్స్‌మెన్‌లో ఓపెన‌ర్‌లు లారెన్స్‌, రికీ రోధ‌మ్ కాస్త ప్ర‌తిఘ‌టించినా వారి పోరాటం చివ‌రికి వృధా అయింది. భార‌త స్పిన్న‌ర్‌లు కీల‌క విజ‌యం అందించారు. ఈ టెస్ట్ విజ‌యంతో భార‌త్ ఆస్ట్రేలియాని వెన‌క్కి నెట్టి టాప్ ర్యాంక్‌ని ద‌క్కించుకుంది. చాలా గ్యాప్ త‌ర్వాత భార‌త్ మ‌రోసారి టెస్ట్ ర్యాకింగ్స్ ప‌ట్టిక‌లో అగ్ర స్థానం ద‌క్కించుకుంది. నాడు ధోని.. నేడు కోహ్లి.. ఇటీవ‌ల ఆ అరుదైన ఫీట్‌ని సాధించింది వీళ్లే.. దీనిని భార‌త్ ఆట‌గాళ్లు ఎలా సెల‌బ్రేట్ చేసుకుంటారో చూడాలి.

Loading...

Leave a Reply

*