షాకింగ్‌..ఈ స్మార్ట్ ఫోన్స్‌లో వాట్స‌ప్ ప‌నిచెయ్య‌దు.. ఈ లిస్ట్‌లో మీ ఫోన్ ఉందా..?

whatsup

వాట్స‌ప్‌.. ఓ సోష‌ల్ మెస్సెంజ‌ర్ ప్లాట్‌ఫామ్‌. ఫేస్ బుక్ త‌ర్వాత దాదాపు యూత్ ఎక్కువ‌గా ఉపయోగించేది వాట్స‌ప్‌నే. డేటా, ఎస్ఎమ్ఎస్‌, ఫోటోలు, వీడియోల‌తోపాటు షేర్ చేసుకునే సౌల‌భ్యం ఉండ‌డంతో వాట్స‌ప్‌ను యూజ్ చేసే వారి సంఖ్య బాగా పెరుగుతోంది. దీనికితోడు, వాయిస్ కాల్స్ కూడా చేసుకోవ‌చ్చు. ఇక స్మార్ట్ ఫోన్‌లు కూడా చీప్ రేట్‌లకే వ‌స్తుండ‌డంతో వాట్సప్ డిమాండ్ మ‌రింత పెరిగింది.

అయితే, వాట్సప్ తాజాగా ప్ర‌క‌టించిన నిర్ణ‌యంతో స్మార్ట్ ఫోన్ వినియోగ‌దారుల‌కు షాకింగ్‌గా మారింది. ఈ ఏడాది ఎండింగ్‌కి కొన్ని మోడ‌ల్స్‌లో వాట్స‌ప్ సేవ‌ల‌ను నిలిపి వేయ‌నున్న‌ట్లు యాజ‌మాన్యం ప్ర‌క‌టించింది. కొన్ని ఆప‌రేటింగ్ సిస్ట‌మ్స్‌కు స‌పోర్ట్ చేసే స‌దుపాయాన్ని అది క్యాన్సిల్ చెయ్య‌డ‌మే ఈ సంచ‌ల‌న నిర్ణ‌యానికి కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. ఆ లిస్ట్‌ని కింద ఇస్తున్నాం.. మ‌రి, మీ ఫోన్ ఈ జాబితాలో ఉందో లేదో చెక్ చేసుకోండి..

1. బ్లాక్‌బెర్రీ ఓఎస్, బ్లాక్‌బెర్రీ 10
2. నోకియా సింబియన్ ఎస్60
3. ఆండ్రాయిడ్ 2.1, ఆండ్రాయిడ్ 2.2
4. విండోస్ ఫోన్ 7.1
5. ఐఫోన్ 3జీఎస్, ఐఓఎస్ 6

ఈ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్స్‌తో ప‌నిచేసే ఫోన్‌ల‌కు త్వ‌ర‌లోనే వాట్స‌ప్ సేవలు నిలిచిపోనున్నాయ‌ట‌. ఇది నిజంగా ఓ షాకింగ్ న్యూస్‌.

Loading...

Leave a Reply

*