బీఎండ‌బ్ల్యూ నాకేందుకంటున్న దీప‌!

deepa

ఒలింపిక్‌లో విశేష ప్ర‌తిభ క‌న‌బ‌ర‌చిన దీపా క‌ర్మాక‌ర్‌కు కొత్త‌ క‌ష్టం వ‌చ్చింది. పాడైపోయిన స్కూట‌ర్ పార్టుల‌తో ప్రాక్టీస్ చేసి ఒలింపిక్స్‌లో చెల‌రేగిన దీపను ఇప్పుడు బీఎండబ్ల్యూ కారు ఇబ్బంది పెడుతోంది. ప్ర‌పంచంలోని జిమ్నాస్ట్‌లంద‌రినీ త‌న స‌త్తాతో ఎదుర్కోగ‌లిగిన ఈ భార‌తీయ ఆశాదీపం… ఓ లగ్జ‌రీ కారును మాత్రం భ‌రించలేక‌పోతోంది. నాకు ఈ కారొద్దు బాబూ మీరే తీసుకు పోండి అంటూ అది ఇచ్చిన దాత‌ల‌ను వేడుకొంది. ఒలింపిక్స్‌లో ప‌త‌కాన్ని కొద్దిలో మిస్ చేసుకున్నా భార‌తీయ ప‌తాకాన్ని మాత్రం విశ్వ‌వినీలాకాంశంలో స‌గ‌ర్వంగా ఏగుర‌వేసింది దీపా క‌ర్మాక‌ర్‌. దాంతో దేశం మొత్తం ఆమెకు సెల్యూట్ చేసింది. ఆ క్ర‌మంలోనే ఒలింపిక్ విజేత‌ల‌తో పాటు దీప‌కు కూడా చాముండేశ్వ‌రీనాథ్‌… స‌చిన్ టెండూల్క‌ర్ చేతుల మీదుగా ల‌గ్జ‌రీ కారు బీఎండ‌బ్ల్యూను అంద‌జేశారు.

అయితే, ఇప్పుడు అదే ల‌గ్జ‌రీ కారును తాను ఉప‌యోగించుకోలేక పోతున్నాన‌ని అంత పెద్ద కారు త‌న‌కు వ‌ద్ద‌ని ద‌య‌చేసి దాన్ని వెన‌క్కి తీసుకోవాల‌ని దీప స‌ద‌రు దాత‌ల‌ను కోరింది. అగ‌ర్త‌ల రోడ్ల‌పై ఈ కారు న‌డ‌ప‌డం క‌ష్ట‌మ‌ని, అలాగే, దాన్ని నిర్వ‌హ‌ణ కూడా త‌న‌కు భార‌మేన‌ని ఆమె తెలిపింది. దీప క‌ష్టాన్ని అర్థం చేసుకున్న చాముండేశ్వ‌రీనాథ్ కారును వెన‌క్కి తీసేసుకుంటాన‌ని అలాగే, ఆ కారుకు అయిన ఖ‌ర్చులో మొత్తం దీపకు న‌గ‌దు రూపంలో అంద‌జేస్తాన‌ని చెప్పిన‌ట్లు తెలిసింది. అయితే, ఇదే ప‌ని ముందే చేసి ఉంటే… కార్లు ఇచ్చే బ‌దులు డ‌బ్బులే ఇచ్చి ఉంటే అర‌కొర వ‌స‌తుల‌తో శిక్ష‌ణ తీసుకుంటున్న దీప‌లాంటి క్రీడాకారుల‌కు ఎంతో ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉండేద‌ని స‌ద‌రు దాత‌లు ఇప్పుడు అనుకుంటున్నార‌ట‌.

Loading...

Leave a Reply

*