అడ్డంగా దొరికిపోయి… పోలీసుల‌కు చిక్కిన రేష్మి…!

untitled-22

షాకింగ్ న్యూస్‌… పోలీసుల‌కు అడ్డంగా దొరికిపోయిందట‌ ప్ర‌ముఖ యాంక‌ర్ రేష్మి. ప‌లువురితో క‌లిసి ర‌చ్చ ర‌చ్చ చేస్తూ బుక్ అవ‌డంతో ఆమెకు వార్నింగ్ ఇచ్చి పంపేశార‌ట పోలీసులు.హాట్ హాట్ అందాల‌తో బుల్లితెర‌పై స్టార్ యాంక‌ర్‌గా గుర్తింపు తెచ్చుకున్న రేష్మికి రేంజ్ బాగా మారిపోయింది. చిన్న సినిమాల‌కు బిగ్ ఎస్సెట్‌గా మారింది. గ్లామ‌ర్ షోతో రేష్మి హీరోయిన్‌గా కూడా పాపులారిటీ పొందుతోంది. అలాంటి రేష్మి ఇప్పుడు రియ‌ల్ లైఫ్‌లోనూ రెచ్చిపోతోంది. రీసెంట్‌గా రేష్మి ఓ పార్టీకి అటెండ్ అయింద‌ట‌. ఇది బడా బాబుల పార్టీ కావ‌డంతో అక్క‌డ ఫుల్‌గా మందేసి అరుపులు, కేక‌లు, డ్యాన్స్‌ల‌తో గోల గోల చేసింద‌ట‌.

రేష్మితోపాటు పార్టీకి వ‌చ్చిన ఇత‌ర యంగ్‌స్ట‌ర్స్ కూడా ఉండ‌డంతో వారి అరుపులు, కేక‌ల‌తో ఆ పార్టీ హాల్ అంతా మార్మోగిపోయింద‌ట‌. మొద‌ట కొంతసేపు భ‌రించిన ఇరుగుపొరుగు.. ఆ త‌ర్వాత ఎంత‌సేప‌టికి వారి ర‌భ‌స స‌ద్దుమ‌ణ‌గ‌క‌పోవ‌డంతో వెంట‌నే పోలీసుల‌కు కంప్ల‌యిట్ చేశారట‌. 100కు ఫోన్ చెయ్య‌డంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చి.. ఆ పార్టీని వెంట‌నే ఆపేశార‌ట‌. రేష్మితోపాటు ఇత‌ర ఫ్రెండ్స్‌కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి అంద‌రినీ చెద‌ర‌గొట్టి పంపించార‌ట‌. రీసెంట్‌గా స్టార్ యాంక‌ర్‌లు, బుల్లితెర సెల‌బ్రిటీల ర‌చ్చ కూడా పెరుగుతోంది.

నిన్న‌మొన్న‌టిదాకా బ‌డా హీరోయిన్‌లు, అప్‌క‌మింగ్ భామ‌ల వంటి వారే ఇలాంటి న్యూస్‌ల‌తో ర‌చ్చ‌కెక్కేవారు. త్రిష ఆమ‌ధ్య చెన్నై న‌డిరోడ్డుపై మందేసి చిందేసి అడ్డంగా దొరికిపోయింది. అది అప్ప‌ట్లో క‌ల‌క‌లం రేపింది. కానీ, ఇప్పుడు రేష్మితోపాటు ప‌లువురు సెల‌బ్రిటీలు చేస్తున్న ర‌చ్చ ఓ రేంజ్‌లో ఉంద‌ట‌. దానిని భ‌రించ‌డం సాధ్యం కావ‌డం లేద‌నే కంప్ల‌యింట్‌లు వినిపిస్తున్నాయి. మ‌రి, అప్‌క‌మింగ్ సెల‌బ్రిటీలు, పేజ్ 3 వ్య‌క్తులు.. కాస్త హ‌ద్దుల్లో ఉండ‌డం బెట‌ర్ అంటున్నారు.

Loading...

Leave a Reply

*