కేసీఆర్‌ను లైట్ తీసుకున్న మంత్రులెవ‌రు!

kcr

భారీ వ‌ర్షాల‌తో హైద‌రాబాద్ వ‌ణికిపోతోంది. న‌గ‌ర‌వాసి అష్ట‌క‌ష్టాలు ప‌డుతున్నాడు. రోడ్లు, అపార్ట్‌మెంట్‌ల‌న్నీ న‌దుల‌ను త‌ల‌పిస్తున్నాయి. దాంతో ప్ర‌జ‌ల‌ను ఆదుకునేందుకు త‌క్ష‌ణం చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆదేశించారు. నిరంత‌రం అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ప్ర‌జ‌ల‌కు ఎల్ల‌వేళ‌లా అందుబాటులో ఉండాల‌ని కూడా మంత్ర‌లు, అధికారుల‌కు కేసీఆర్ సూచించారు. అయితే, ఒక‌రిద్ద‌రు మంత్రులు అర్ధ‌రాత్రి వ‌ర‌కూ స‌మీక్ష‌లు చేస్తూ ప్ర‌జ‌ల‌కు అవ‌స‌ర‌మైన స‌హాయ‌క కార్య‌క్ర‌మాలు అందించేందుకు కృషి చేస్తున్నారు. మ‌రికొంద‌రు మంత్రులు మాత్రం కేసీఆర్ చెప్పిన త‌ర్వాత కూడా ఆయ‌న మాట‌ల‌ను సైతం లైట్ తీసుకుని వ‌ర‌ద స‌హాయ‌క కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌డంలో నిర్ల‌క్ష్యం వ‌హిస్తున్నారు. దీంతో ఈ మంత్రుల‌పై కేసీఆర్ తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నార‌ని స‌మాచారం.

కాల‌నీల‌కు కాల‌నీలే వ‌ర‌ద ముంపులో కొట్టుకుపోతుంటే తాము రంగంలోకి దిగి అధికారుల‌ను అప్ర‌మ‌త్తం చేసి ప్ర‌జ‌ల‌కు ర‌క్ష‌ణ‌గా నిల‌వాల్సిన‌ మంత్రులు త‌మ‌కేమీ ప‌ట్ట‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న ఆరోప‌ణ‌లున్నాయి. మంత్రులు నాయిని నర్సింహారెడ్డి.. పద్మారావు మాత్రం ఒకటీ అర కార్యక్రమాలకు మాత్రమే అటెండ్ అయ్యి ఆ త‌ర్వాత ప‌త్తా లేకుండా పోయారు. భారీ వర్ష సూచనల నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని కేసీఆర్‌ ముందుగానే అలెర్ట్‌ చేశారు. మంత్రులూ జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. సీఎం ఆదేశాలను గ్రేటర్‌ మంత్రులు చాలా లైట్‌గా తీసుకున్నారు. 0అమాత్యులు బయటకు రాకపోవడంపై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారట! భారీ వర్షాలకు హైదరాబాద్‌ అతలాకుతలం అవుతుంటే గ్రేటర్ మంత్రుల ఇలా నిమ్మ‌కు నీరెత్తిన‌ట్లు ఉండ‌డం ఏం బాగోలేద‌ని కేసీఆర్ త‌న స‌న్నిహితుల వ‌ద్ద వ్యాఖ్యానిస్తున్నార‌ట‌.

Loading...

Leave a Reply

*