ఆ ప‌దినిమిషాలు.. ఫ్లిప్‌కార్ట్‌లో సంచ‌ల‌నం!

flipkart

బిగ్ బిలియ‌న్ డేస్ అంటూ భారీ ఆఫ‌ర్లు ప్ర‌క‌టించిన ఆన్‌లైన్ రిటైల్ దిగ్గ‌జం ఫ్లిప్‌కార్ట్ సంచ‌ల‌నం సృష్టించింది. గ‌త నెల రోజుల నుంచి భారీ అఫ‌ర్లంటూ ఆ సంస్థ చేసిన ప్ర‌చారానికి జ‌నం ఫిదా అయిపోయారు. ఎల‌క్ట్రానిక్స్ అమ్మ‌కాల‌ను రెండో తేదీ అర్ధ‌రాత్రి ప‌న్నెండు గంట‌ల‌కు(మూడో తేదీ) అందుబాటులోకి తెచ్చింది. అంతే ఎప్పుడెప్పుడా అంటూ కంప్యూట‌ర్లు, మోబైల్ యాప్‌ల‌పై వేళ్లు పెట్టుకుని కూర్చున వినియోగ‌దారులు రెచ్చిపోయారు. ఎంత‌గా అంటే ఒక నెల రోజుల్లో విక్ర‌యించిన‌న్ని ఆపిల్ వాచ్‌ల‌ను తాము కేవ‌లం ప‌దంటే ప‌ది నిమిషాల్లోనే అమ్మేశామ‌ని ఫ్లిప్‌కార్ట ప్ర‌క‌టించింది.

సెక‌నుకు 180 ఆర్డ‌ర్లు బుక్ అయిన‌ట్లు కూడ ఆ సంస్థ వెల్ల‌డించింది. 2015లో ప్ర‌క‌టించిన బిగ్‌బిలియ‌న్ డేస్ కంటే ఈ ఏడాది ఆఫ‌ర్ ప్ర‌క‌టించిన తొలి ఆరుగంట‌ల అమ్మ‌కాలు మించిపోయాయ‌ని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. అన్నీ క‌లుపుకుంటే గంట‌కు ల‌క్ష వ‌స్తువుల చొప్పున విక్ర‌యించిన‌ట్లు తెలిపింది. ఇక‌, అమెజాన్ కూడా త‌మ డిస్కౌంట్ సేల్‌కు భారీ స్పంద‌న వ‌స్తుంద‌ని ప్ర‌క‌టించింది. తొలిరోజు 12 గంట‌ల్లోనే 15 ల‌క్ష‌ల ఉత్ప‌త్తులు విక్ర‌యించామ‌ని తెలిపింది. మ‌రో ఆన్‌లైన్ వ్యాపార దిగ్గ‌జం స్నాప్‌డీల్ కూడా తొలి ప‌ద‌హారు గంట‌ల్లోనే 2800 న‌గ‌రాల‌కు చెందిన 11 ల‌క్ష‌ల మంది వ‌స్తువులు కొన్న‌ట్లు వెల్ల‌డించింది.

Loading...

Leave a Reply

*