పెళ్లికి అమ్మాయే దొర‌క‌ట్లేదు!

marraige

దేశంలో పెళ్లికాని ప్ర‌సాదుల‌కు ఇక ఇక్క‌ట్లే. తొంద‌ర‌ప‌డి పెళ్లిళ్లు చేసుకోకుంటే ఇక జీవితమంతా అలా మిగిలిపోవాల్సిందే. ఆడ‌పిల్ల‌లు భారం అనుకోవ‌డమో… భ్రూణ హ‌త్య‌లో కార‌ణ‌మేదైనా భార‌త్‌లో అమ్మాయిల కొర‌త తీవ్ర‌మ‌వుతోంది. ఒక‌వైపు పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిలు దొర‌క‌డం లేద‌న్న ఆందోళ‌న వ్య‌క్తం అవుతున్నా ఆడ పిల్ల‌ల్ని క‌నేందుకు మాత్రం భార‌తీయులు విముక‌త వ్య‌క్తం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. తాజాగా వెల్ల‌డైన గ‌ణాంకాల ప్ర‌కారం… ఢిల్లీలో 2014 సంవ‌త్స‌ర‌లో వెయ్యిమంది అబ్బాయిల‌కు 876 మంది అమ్మాయిలు మాత్ర‌మే పుట్టారు. అంత‌కుముందు ఏడాది ఈ సంఖ్య 887 కావ‌డం గ‌మ‌నార్హం.

అంటే ప్ర‌తి ఏటా ఆడ పిల్ల‌ల జ‌న‌నాల సంఖ్య తిరోగ‌మ‌నం దిశ‌గా సాగుతోంది. మొత్తం దేశాన్ని ఒక యూనిట్‌గా తీసుకుంటే 2011-13 మ‌ధ్య కాలంలో ప్ర‌తి వెయ్యి మందికి 909 మంది అమ్మాయిలు ఉండ‌గా, 2012-14 సంవ‌త్స‌రాల‌లో ఆ సంఖ్య 906కు త‌గ్గింది. శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ లెక్కల ప్ర‌కారం అమ్మాయిల జ‌న‌నాల సంఖ్య త‌గ్గిపోవ‌డం ఢిల్లీల‌లో అధికంగా ఉండ‌గా, రెండో స్థానంలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఉంది. త‌మిళ‌నాడు కూడా ఇప్పుడు లింగ‌నిష్ప‌త్తి విష‌యంలో భారీ వ్య‌తాసాలు న‌మోద‌య్యే ఉత్త‌రాది రాష్ట్రాల స‌ర‌స‌న చేరిపోతుంది. ఇక్క‌డ కూడా వెయ్యి మంది అబ్బాయిల‌కు గ‌తంలో 927 మంది అమ్మాయిలు పుడితే ఇప్పుడు ఆ సంఖ్య 921కి ప‌డిపోయింది.

Loading...

Leave a Reply

*