జియో నెట్‌వ‌ర్క్ రావ‌ట్లేదా.. ప‌రిష్కారం మీ చేతుల్లోనే!

how-to-get-gio-network-in-your-cell

స్మార్ట్‌ఫోన్లు వాడేవాళ్ల‌కు సిగ్న‌ల్స్ స‌రిగా రాక‌పోతే చిర్రెత్తుకుపోతుంది…. కాల్స్ రాక‌పోతే కాల్స్ వెళ్ల‌క‌పోతే కాలిపోతుంది… వాళ్లు ఫోన్ వాడేది కేవ‌లం కాల్స్ కోస‌మే కాదు… చాలా ప‌నులు చేస్తుంటారు… బ్రౌజింగ్ చేస్తారు… ఆన్‌లైన్ లావాదేవీలు చేసుకుంటారు.. మాట్లాడితే ఫేస్‌బుక్‌, వాట్స‌ప్‌, ట్విట్ట‌ర్‌ల‌లో మెసేజ్‌లు పంపుతుంటారు….సెల్ఫీల‌తో కుల్ఫీ అయిపోతుంటారు…స్మార్ట్ ఫోనే లోకంగా బ‌తికేస్తుంటారు… అలాంటివాళ్లకి నెట్‌వ‌ర్క్‌ లేక‌పోతే మైండ్ బ్లాక‌యిపోతుంది… సిగ్న‌ల్స్ లేక‌పోతే చికాకు ప‌డిపోతారు…

ఇప్పుడు ఇండియ‌న్ టెలికం రంగంలోకి తుఫాన్‌లా దూసుకువ‌చ్చిన జియో జ‌నం చేత జ‌య‌హో అనిపించుకుంది… డేటా, కాల్స్ అన్ని ఫ్రీగా ఇచ్చి జ‌నానికి ఫీవ‌ర్ తెప్పించింది… జియో డేటాగిరికి జ‌నం గులాంగిరి చేస్తున్నారు.. అలాంటి జియో త‌మ యూజ‌ర్ల కోసం మ‌రో కొత్త సౌక‌ర్యం కూడా తీసుకువ‌చ్చింది.. మీ ఏరియాలో జియో నెట్‌వ‌ర్క్ రావ‌డం లేదా… ఏం ఫిక‌ర్ లేదు… యూజ‌ర్లు త‌మ ఏరియా ప‌రిధిలో నెట్‌వ‌ర్క్ క‌వ‌రేజ్‌ను చెక్ చేసుకునేందుకు స్మార్ట్ క‌వ‌రేజ్ మ్యాప్ పేరుతో స‌రికొత్త స‌ర్వీసును రిల‌య‌న్స్ జియో లాంచ్ చేసింది.

ఈ స్మార్ట్ క‌వ‌రేజ్ మ్యాప్ ద్వారా జియో యూజ‌ర్లు త‌మ ఏరియాలోని జ‌యో 4జీ ట‌వ‌ర్‌కు సంబంధించి ఎప్ప‌టిక‌ప్పుడు నెట్‌వ‌ర్క్ సిగ్న‌ల్స్‌ను చెక్ చేసుకోవ‌చ్చు.. ఎయిర్‌టెల్ నెట్‌వ‌ర్క్ ఫీచ‌ర్‌కు పోటీగా రిల‌య‌న్స్ జియో త‌మ యూజ‌ర్ల కోసం అందుబాటులోకి తెచ్చిన స్మార్ట్ క‌వ‌రేజ్ మ్యాప్‌కి చాలా ప్ర‌త్యేక‌త‌లు ఉన్నాయి. ఈ ఫీచ‌ర్ కావాల‌నుకునేవాళ్లు ముందుగా జియో వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయి త‌మ మొబైల్ నెంబ‌ర్‌తో రిజిస్ట‌ర్ చేసుకోవాలి. త‌ర్వాత స్మార్ట్ క‌వ‌రేజ్ మ్యాప్ క‌నిపిస్తుంది..ఈ మ్యాప్ ద్వారాసిగ్న‌ల్‌, స్ట్రెంగ్త్‌, క్వాలిటీ వంటి వివ‌రాలు తెలుసుకోవ‌చ్చు….ఈ ఫీచ‌ర్ ప‌నిచేయాలంటే మొబైల్‌లో జీపీఎస్‌ను ఆన్ చేసి ఉంచాల్సి ఉంటుంది…అంతేకాకుండా మీ లొకేష‌న్‌కు సంబంధించిన వివ‌రాల‌ను కూడా పొందుప‌రచాలి…. సో త్వ‌ర‌గా స్మార్ట్ క‌వ‌రేజ్ మ్యాప్ తీసుకుని స్మార్ట్‌గా వ్య‌వ‌హ‌రించండి.

 

Loading...

Leave a Reply

*