హైద‌రాబాద్‌లో హై అల‌ర్ట్‌!

hyderabad

విశ్వ‌న‌గ‌రం మునిగిపోయింది. దంచేస్తున్న వాన‌తో బెంబేలెత్తిపోతోంది. ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న వాన‌తో న‌గ‌రం అత‌లాకుత‌లం అయిపోతోంది. న‌గ‌ర‌వాసి చివురుటాకులా వ‌ణికిపోతున్నాడు. రోడ్ల‌న్నీ గుంటలు గుంటలు. కాలుపెట్టే వీలులేకుండా రోడ్ల‌న్నీ పొంగిపొర్లుతున్న వాగుల‌వుతున్నాయి. న‌గ‌రంలోని ప్ర‌ధాన ర‌హ‌దారుల‌న్నీ ట్రాఫిక్ జాంల‌తో దిగ్బంధానికి గుర‌వుతున్నాయి. దీంతో ప్ర‌భుత్వ యంత్రాంగ‌మంతా అప్ర‌మ‌త్త‌మైంది. న‌గ‌రంలో హై అల‌ర్ట్ ప్ర‌క‌టించింది. అవ‌స‌ర‌మైతే త‌ప్పించి ఎవ‌రూ బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని పోలీసులూ ఆదేశాలు జారీ చేశారు. రోడ్ల‌పై వాహ‌నాలు స‌వ్యంగా న‌డిచే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతో రెండు రోజుల పాటు స్కూళ్ల‌కు సెల‌వు ప్ర‌క‌టించింది.

హుస్సేన్‌సాగ‌ర్ నిండిపోతుండ‌డంతో స‌గ‌టు హైద‌రాబాదీ గుండెల్లో రైళ్లు ప‌రుగెడుతున్నాయి. మంత్రులు, అధికారుల‌కైతే కంటి మీద కునుకు ఉండ‌డం లేదు. అర్థ‌రాత్రులు కూడా రోడ్ల‌పై తిరుగుతూ స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. గ్యాప్ లేకుండా కురుస్తున్న భారీ వ‌ర్షంతో న‌గ‌రంలోని, శివార్ల‌లోని చాలా ప్రాంతాలు జ‌ల‌మ‌య‌మ‌య్యాయి. నిన్న‌టి వ‌ర‌కూ త‌లెత్తి ఠీవిగా నిలుచున్న అపార్ట్‌మెంట్‌ల‌న్నీ ఇప్పుడు న‌దుల్లో తేలుతున్నాయి. పై నుంచి కురుస్తున్న వాన‌లో త‌డుస్తూ…

సెల్లార్ల‌లోకి చేరిన నీళ్ల‌ను తోడిపోసుకుంటూ న‌గ‌ర‌వాసులంతా క్ష‌ణ‌మొక యుగంలా గ‌డుపుతున్నారు. ఒక‌ప్పుడు ఒక‌టి రెండు సెంటీమీట‌ర్ల వాన కుర‌వ‌డమే గ‌గ‌నం అయ్యే ప‌రిస్థితి. ఇప్పుడు ఏకంగా ఏడు, ఎనిమిది, ప‌ది సెంటీమీట‌ర్ల వ‌ర్షం కురుస్తుండ‌డంతో ప్ర‌భుత్వ‌మూ, అధికారులూ ఏం చేయ‌లేని ప‌రిస్థితి. అయిన‌ప్ప‌టికీ వ‌ర్షాలు, వ‌రదల‌తో జ‌నం ఇబ్బందులు ప‌డ‌కుండా ఉండేందుకు త‌మ వంతు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. గ‌త 80 ఏళ్ల కాలంలో ఎన్న‌డూ ఇంత‌టి భారీ వ‌ర్షం కుర‌వ‌లేద‌ని అధికార‌యంత్రాంగం ప్ర‌క‌టించింది.

Loading...

Leave a Reply

*