దేవినేని ఉమ చెప్పారు… హ‌రీవ్ చేశారు!

devineni-uma

ఢిల్లీలో జ‌రిగిన అపెక్స్ క‌మిటీ స‌మావేశంలో చంద్ర‌బాబుపైనే మాట‌ల దాడి చేసిన వ్య‌క్తి తెలంగాణ నీటిపారుద‌ల శాఖ మంత్రి హ‌రీశ్ రావు. ఆ స‌మావేశంలో ఉన్న కేసీఆర్ స్వ‌యంగా జోక్యం చేసుకుని హ‌రీశ్‌ను స‌ముదాయించిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. ఇది జ‌రిగిన ఒక రోజుకే ఏపీకి చెందిన నీటిపారుద‌ల శాఖ మంత్రి దేవినేని ఉమ తెలంగాణ మంత్రి హ‌రీశ్ రావుకు ఫోన్ చేశారు. భారీ వర్షాలతో వ‌ర‌ద నీరు ఉప్పొంగుతుంద‌ని పులిచింత‌ల పొంగిపొర్లుతుంద‌ని ఉమ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఇదే విష‌యం హ‌రీశ్‌కూ చెప్పారు.

త‌క్ష‌ణం న‌ల్గొండ జిల్లా క‌లెక్ట‌ర్‌తో మాట్లాడి పులిచింత‌ల వ‌ర‌ద నీటితో ఇబ్బంది ప‌డే గ్రామాల‌ను ఖాళీ చేయించాల‌ని కోరారు. వెంట‌నే స్పందించిన హ‌రీశ్ జిల్లా క‌లెక్ట‌ర్‌తో మాట్లాడి పులిచింతల ప్ర‌భావిత ప్రాంత‌ల ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేయాల‌ని ఆదేశించారు. మేళ్ల‌చెరువు మండ‌లాల్లోని న‌దీతీర గ్రామాల‌ను ఖాళీ చేయించాల‌ని హ‌రీశ్ ఆదేశించ‌డంతో క‌లెక్ట‌ర్ కూడా ఆ మేర‌కు త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు తీసుకున్నారు. ఢిల్లీలో ఏపీ తీరుపై హాట్‌హాట్‌గా స్పందించిన హ‌రీశ్‌, రాష్ట్రంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఏపీ ప్ర‌భుత్వం కోర‌గానే త‌క్ష‌ణం స్పందించడం గ‌మ‌నార్హం.

Loading...

Leave a Reply

*