అమిత్ షాకుల‌కు కేసీఆర్ స్నేహ హ‌స్తం!

kcr-and-amith-shah

కేంద్రం ఇచ్చిన అబివృద్ధి నిధుల‌ను తెలంగాణ సీఎం ఎమ్మెల్యేల‌ను కొనేందుకు వాడుతున్నార‌ని అమిత్ షా ఆరోపించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ చీఫ్ చేసిన ఈ ప్ర‌క‌ట‌న రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టించింది. మామూలు నేత‌లే త‌న‌పై విమ‌ర్శ‌లు చేస్తే స‌హించ‌లేని కేసీఆర్ ప్ర‌త్య‌ర్థి పార్టీ నేత ఇంత‌టి తీవ్ర ఆరోప‌ణ చేస్తే ఇంకేలా స్పందిస్తారా అని అంద‌రూ చూశారు. అయితే, కేసీఆర్ భిన్నంగా స్పందించారు. ప్ర‌జ‌ల్లో త‌న‌ను, త‌న పార్టీని ప‌లుచ‌న చేస్తున్న బీజేపీతో స్నేహ‌గీతం పాడేందుకే ఆయ‌న ప్రాధాన్య‌త ఇస్తున్నారు. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా బీజేపీ నేత‌ల‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. బీజేపీతో త‌గ‌వులు పెట్టుకోవ‌డం కంటే.. మిత్ర‌త్వం కొన‌సాగించ‌డ‌మే మంచిద‌న్న నిర్ణ‌యానికి కేసీఆర్ వ‌చ్చిన‌ట్లే ఉన్నారు.

ఇందుకు ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణే కేసీఆర్ డిల్లీ ప‌ర్య‌ట‌న‌. ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ గ‌తంలో ఎవ‌రినీ పెద్ద‌గా ప‌ట్టించుకునే వారు కాదు. అయితే, ఈ సారి మాత్రం కేంద్ర మంత్రులను క‌లుస్తున్నారు. తెలంగాణ‌కు చెందిన ద‌త్తాత్రేయ‌ను ఆయ‌న ఇంటికే వెళ్లి క‌లిశారు. గ‌తంలో త‌న‌ను క‌ల‌వాల్సిందిగా ద‌త్తాత్రేయ క‌బురు పంపినా పట్టించుకోని కేసీఆర్ ఇప్పుడు ఆయ‌న ఇంటికే వెళ్ల‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. పైగా ద‌త్తాత్రేయ మ‌న‌కు పెద్ద‌న్న అని కేంద్రంలో ఏ ప‌ని అయినా ఆయ‌న‌తోనే చేయించుకోవాల‌ని కేసీఆర్ త‌న ఎంపీల‌కు సూచించారు. బీజేపీతో పెట్ట‌కుంటే అస‌లుకే మోసం వ‌స్తుంద‌ని కేసీఆర్ గ్ర‌హించిన‌ట్లున్నారు.

అందుకే అమిత్ షా వ్యాఖ్య‌ల‌పై టీఆర్ఎస్‌కు చెందిన చిన్నాచిత‌క నేత‌లు స్పందించారు కానీ పెద్ద నేత‌లెవ‌రూ నోరు మెద‌ప‌లేదు. షా వ్యాఖ్య‌ల‌ను తిప్పికొడితే బీజేపీ నేత‌లు మ‌రింత‌గా దాడి పెంచితే తాము మ‌రింత‌గా మునిగిపోతామ‌న్న భ‌యం టీఆర్ ఎస్ నేత‌ల‌ను వెంటాడుతున్న‌ట్లే ఉంద‌ని ఇత‌ర విఫ‌క్షాల నేత‌లు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, తెలంగాణ‌లో స్వ‌యంగా ఎద‌గాల‌ని అనుకుంటున్న బీజేపీ ఇప్పుడు కేసీఆర్ చాస్తున్న స్నేహ‌హ‌స్తాన్ని అందుకుంటుందో లేక‌, క‌య్యానికే కాలు దువ్వుతుందో మ‌రి.

Loading...

Leave a Reply

*