శాంసంగ్‌, ఆపిల్‌ను షేక్ చేయ‌నున్న గూగుల్ ఫోన్‌

samsung

ప్ర‌పంచ మొబైల్ మార్కెట్‌ను రెండే రెండు స్మార్ట్ ఫోన్లు శాసిస్తున్నాయి… సాఫ్ట్‌వేర్ హార్డ్‌వేర్‌ల‌లో వాటిదే పైచేయి… ఒక‌టి అమెరికాలోని ఆపిల్ మొబైల్ ఫోన్ల కంపెనీ…. రెండోది ద‌క్షిణ కొరియాకు చెందిన ఎల‌క్ట్రానిక్స్ దిగ్గ‌జం శాంసంగ్‌…. ప్ర‌పంచ మార్కెట్‌లో ఈ రెండు పోటీ ప‌డుతుం టాయి… ఆపిల్ ఐ ఫోన్ల‌తో హంగామా చేస్తుంటే, గ్యాల‌క్సీ ఫోన్ల‌తో శాంసంగ్ సంద‌డి చేస్తుంటుంది.. ఆపిల్ ఐ ఫోన్ 7 సిరీస్‌ను విడుదల చేస్తే దానికి పోటీ శాంసంగ్ 7 సిరీస్ కూడా విడుద‌లైంది… ఇలా ఈ రెండు దిగ్గ‌జాలు ఒక‌రిపై మ‌రొక‌రు పైచేయి సాధించ‌డానికి ఎత్తులుపైఎత్తులు వేస్తుంటాయి… అయితే వీటికి పోటీ ఇద్దామ‌ని ఆ మ‌ధ్య ఇంట‌ర్‌నెట్ దిగ్గ‌జం, బ‌డా సెర్చ్ ఇంజ‌న్ గూగుల్ కూడా రంగంలోకి దిగింది.. గూగుల్ నెక్స‌స్ ఫోన్ల‌తో జ‌నంలోకి వెళ్లింది…

అయితే అమెరికా నుంచి అన‌కాప‌ల్లి దాకా…. జ‌పాన్ నుంచి జ‌గిత్యాల దాకా వినియోగ‌దారుల‌ను ఇవి ఆక‌ట్టుకోలేక పోయాయి…. ఆపిల్ ఐఫోన్‌, శాంసంగ్ ఫోన్ల ధాటికి గూగుల్‌లో గుబులు రేగింది… నెక్స‌స్‌తో స‌క్సెస్ సాధించ‌లేక‌పోయిన గూగుల్‌లో క‌సి రేగింది… దీంతో నెక్స‌స్‌ను ప‌క్క‌న పారేసి స‌రికొత్త‌గా పిక్సెల్ తీసుకువ‌స్తోంది… ఈ పిక్సెల్ ఫోన్ల‌తో ఆపిల్‌, శాంసంగ్‌ల‌ను పిచ్చ‌పిచ్చ‌గా దెబ్బ‌తియ్యాల‌ని డిసైడైపోయింది గూగుల్‌… పిక్సెల్‌, పిక్సెల్ ఎక్సెల్ పేర్ల‌తో రెండు కొత్త మోడ‌ళ్ల‌ను లాంచ్ చేసింది… త‌మ‌కు స‌క్సెస్ ఇవ్వ‌ని నెక్స‌స్‌ను గూగుల్ ప‌క్క‌న పారెయ్య‌డానికి పెద్ద కార‌ణాలే ఉన్నాయి..2010లో నెక్స‌స్ ఫోన్ల‌ను గూగుల్ లాంచ్ చేసింది…

అయితే త‌మ ఫోన్లు కూడా సాధార‌ణ ఆండ్రాయిడ్ ఫోన్ల‌లాగానే ఉన్నాయ‌నే విష‌యం గూబ గుయ్యిమ‌న్నాక గూగుల్‌కి అర్థ‌మైంది… ఆ త‌ర్వాత ఆపిల్ ఫోన్ల మార్కెట్‌ను కొల్ల‌గొట్టి ఆండ్రాయిడ్ మార్కెట్‌ను కంట్రోల్ చేయాల‌ని భారీ స్కెచ్ గీసింది గూగుల్‌… దీనికోసం హెచ్‌టీసీతో టైఅప్ అయింది.. ఫోన్ల‌ను హెచ్‌టీసీ త‌యారుచేస్తే వాటిపై త‌న లోగోను వేసుకుంటుంది గూగుల్‌. ఆండ్రాయిడ్ ఫోన్ యూజ‌ర్ల‌కు అందుబాటులో లేని సరికొత్త ఫీచ‌ర్ల‌తో రంగంలోకి దిగింది గూగుల్‌…. అయితే ఆపిల్‌, శాంసంగ్ ఫోన్ల‌తో నెక్స‌స్ నెగ్గ‌లేక‌పోయింది… దీని స్థానంలో గూగుల్ తెచ్చిన పిక్సెల్ అయినా స‌క్సెస్ అవుతుందేమో చూడాలి.

Loading...

Leave a Reply

*