ఈ క‌లెక్ట‌ర్ బాబుకి బంధువు.. ర‌చ్చ ర‌చ్చ చేస్తున్నాడ‌ట‌..!

collector-bhaskar

ఏపీలోని ఆ జిల్లాలో అంతా క‌లెక్ట‌ర్‌దే రాజ్యం… ఎంపీ ఏం పీక‌లేడు… ఎమ్మెల్యేలు ఏం మాట్లాడ‌లేరు…. ఆఖ‌రికి అధికార టీడీపీ నేత‌లు కూడా పైన కింద మూసుకుని కూర్చోవాల్సిందేట‌…. ఎందుకంటే ఆయ‌న బాబుగారి క‌లెక్ట‌ర్‌… చంద్ర‌బాబుకి బంధువుట‌…. అంతే పేను పెత్త‌నం చేసిన‌ట్టు అంద‌రిమీద పెత్త‌నం చేస్తున్న ఆయ‌న జిల్లాను గొరిగేస్తున్నాడ‌ని, త‌మ‌ను లెక్క చేయ‌డం లేద‌ని నేత‌లు వాపోతున్నారు….సీఎం చంద్ర‌బాబు అయితే ఈయ‌న క‌లెక్ట‌ర్ బాబుగా మారిపోయాడ‌ని అధికార పార్టీ నేత‌లే ఆవేద‌న చెందుతున్నారు….. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా క‌లెక్ట‌ర్ కాట‌మ‌నేని భాస్క‌ర్‌రావు తీరుపై స్థానికుల‌తో పాటు విప‌క్ష నేత‌లు, అధికార‌ప‌క్ష నేత‌లు కూడా తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు… కాట‌మ‌రాయుడా క‌దిరి న‌ర‌సింహుడా అంటూ కోపంతో కూడిన అస‌హ్యంతో క‌లిగిన కంప‌రంతో క‌లెక్ట‌ర్‌ను తిట్టిపోస్తున్నారు జిల్లా జ‌నం విప‌క్ష నేత‌లు…

కాట‌మ‌నేని సీఎం చంద్ర‌బాబుకు ద‌గ్గ‌ర బంధువు కావ‌డంతో ఆయ‌న‌ ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు వెల్లువెత్తు తున్నాయి… జ‌నాన్ని చీమ‌లు దోమ‌ల్లా చూస్తున్న ఈయ‌న ప్ర‌తిప‌క్ష నేత‌ల‌ను అస్స‌లు లెక్క చేయ‌డం లేద‌ని విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి… ఆఖ‌రికి అధికార పార్టీ ఎమ్మెల్యేల ఆదేశాల‌ను సైతం లెక్క చేయ‌కుండా కేవ‌లం త‌న‌కు అనుకూలంగా ఉండే ఇద్ద‌రుముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల కు మాత్ర‌మే ఆయ‌న ప‌నులు చేసి పెడుతున్నార‌నే ఆరోప‌ణ‌లు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి… టీడీపీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని త‌న‌కు బంధువు  కావ‌డంతో ఆయ‌న‌తో పాటు మ‌రో ఎమ్మెల్యేలతో మాత్ర‌మే క‌లెక్ట‌ర్ సానుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారని సీపీఎం, కాంగ్రెస్ నేత‌లు ఆరోపిస్తున్నారు.. జిల్లాకు టీడీపీ అధ్య‌క్షుడిలా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈయ‌న‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి అన్ని విపక్షాలు.

Loading...

Leave a Reply

*