మహాత్మా గాంధీ మ‌న‌వ‌డు క‌న్నుమూత‌..!

gandhi

కానూ గాంధీ.. మహాత్మా గాంధీ మ‌న‌వ‌డు.. తుది శ్వాస విడిచారు.గ‌త కొద్దిరోజులుగా తీవ్ర అస్వ‌స్థ‌తో ఆస్ప‌త్రిలో బాధ‌ప‌డుతున్న ఆయ‌న గుజ‌రాత్‌లోని సూర‌త్‌లోని ఓ ఆస్ప‌త్రిలో క‌న్నుమూశారు. 1920ల‌లో జ‌న్మించారు కానూ గాంధీ. ఆయ‌న‌కు ఇప్పుడు సుమారు 93 ఏళ్లు.

బాల్య‌ద‌శ‌లోనే స్వాతంత్ర్య సంగ్రామంలో చురుగ్గా పాల్గొన్నారు కానూ గాంధీ. భార‌త దేశ స్వాతంత్ర్య సంగ్రామాన్ని కీల‌క మ‌లుపు తిప్పిన దండి ఉద్య‌మం స‌మ‌యంలో కానూ గాంధీ కూడా పాలు పంచుకున్నారు. గాంధీ క‌ర్ర ప‌ట్టుకుని ముందుకు లాక్కుపోతున్న ఆయ‌న బాల్యం నాటి ఫోటో ఇప్ప‌టికీ అంద‌రినీ అల‌రిస్తూనే ఉంటుంది. ఆ ఫోటోలో ఉన్న‌ది కానూగాంధీనే. ప్ర‌తి భార‌తీయ పౌరుడిపై చెర‌గ‌ని ముద్ర వేస్తుంది ఈ ఫోటో.

శాస్త్ర సాంకేతిక అంశాల‌పై ఆయ‌న‌కు మ‌క్కువ ఎక్కువ. అదే ఆయ‌న‌ను అమెరికా శాస్త్ర‌సాంకేతిక విభాగం నాసాలో సైంటిస్ట్‌గా జాయిన్ అయ్యేలా చేసింది. కానీ, జీవితం చ‌ర‌మాంకంలో ఆయ‌న దుర్భ‌ర దారిద్ర్యాన్ని అనుభ‌వించారు. గ‌త కొద్దికాలంగా ఆయ‌న ఖ‌ర్చుల‌కు కూడా డ‌బ్బులు లేక ఆర్ధికంగా ఇబ్బంది ప‌డ్డారు. దీంతో, ఆయ‌న చిన్న‌నాటి స్నేహితుడు.. ధీమంత్ బుధియా అనే వ్యాపారి ఆయ‌న ఆర్ధిక అవ‌స‌రాల‌కు సాయం చేస్తున్నాడు.

ఇటీవ‌ల కానూ గాంధీ ఆరోగ్యం పూర్తిగా చెడిపోవ‌డంతో కొంద‌రు సూర‌త్‌లోని రాధాస్వామి ఆశ్ర‌మం వారు ఆయ‌న బాధ్య‌తలు తీసుకున్నారు. ఆయ‌న‌ను ద‌గ్గ‌ర‌లోని శివ‌జ్యోతి ఆశ్ర‌మంలో చేర్పించారు. ఆయ‌న భార్య శివ‌ల‌క్ష్మీది కూడా ఇదే ప‌రిస్థితి. ఆమె కూడా తీవ్ర అనారోగ్యంతో బాధ ప‌డుతున్నారు. వ‌య‌సు మీర‌డంతో ఆమెకు చెవులు ప‌నిచెయ్య‌డం లేదు. చూపు కూడా మంద‌గించింద‌ట‌. వీరికి సంతానం లేదు. మొత్త‌మ్మీద‌, గాంధీ సంతానంలో చివ‌రి వ్య‌క్తి ఇలా మ‌ర‌ణించ‌డం విశేషం.

Loading...

Leave a Reply

*