మెగా బ్ర‌ద‌ర్స్‌కి గాలి ఇన్విటేష‌న్‌లు.. కార్డ్‌లో గిఫ్ట్ చూసి అదిరిప‌డ్డ ప‌వ‌న్‌, చిరు..!

mega

గాలి జ‌నార్ద‌న్ రెడ్డి కూతురి వివాహానికి ముహూర్తం ద‌గ్గ‌ర‌ప‌డుతోంది. అత్యంత వైభ‌వంగా కనీవినీ ఎరుగని రీతిలో ఈ మ్యారేజ్‌ని నిర్వ‌హించడానికి ఆయ‌న స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న‌ట్లు వెడ్డింగ్ కార్డ్‌తోనే ఆయ‌న సెల‌విచ్చారు. ఒక్కో కార్డ్‌కి గాలి జనార్ద‌న్ రెడ్డి ఏకంగా ఆరువేల రూపాయ‌లు ఖ‌ర్చు చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. దీనిపై ఎన్ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నా, ఐటీ రెయిడ్స్ చేస్తార‌నే బూచి వెంటాడుతున్నా గాలి జ‌నార్ద‌న్ రెడ్డి ఏమాత్రం త‌గ్గ‌ట్లేద‌ట‌. ఆకాశమంత పందిరి, భూదేవంత మండ‌పంతో మ్యారేజ్ చెయ్య‌డానికే ఆయ‌న నిశ్చ‌యించుకున్న‌ట్లు స‌మాచారం. మ్యారేజ్‌పై ఆయ‌న ప‌నుల‌న్నీ శ‌ర‌వేగంగా పూర్తి చేస్తున్నారు.

నిన్న‌టిదాకా శాండ‌ల్‌వుడ్‌లో పెళ్లి కార్డులు పంచిన గాలి జనార్ద‌న్ రెడ్డి.. తాజాగా టాలీవుడ్‌లోని ప్రముఖుల‌కు కూడా ఇన్‌విటేష‌న్‌లు పంచుతున్న‌ట్లు స‌మ‌చారం. రాత్రి మెగా బ్ర‌ద‌ర్స్ చిరంజీవి, ప‌వ‌న్‌తోపాటు దాస‌రి నారాయ‌ణ‌రావు వంటి వారికి కార్డ్‌లు ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. ఈ కార్డ్‌ల‌తోపాటు ఆయ‌న ఓ అదిరిపోయే గిఫ్ట్‌ను కూడా ప్యాక్ చేసి ఇచ్చార‌ట‌. వెండితో చేసిన వినాయ‌క విగ్ర‌హం ఇచ్చార‌ట‌. అది అద్భుతంగా ఉంద‌ని, దానిని చూసి చిరంజీవి, ప‌వ‌న్ వంటి వారు కూడా షాక్ అయ్యార‌నే రేంజ్‌లో ప్ర‌చారం జ‌రుగుతోంది. అంటే, అది ఏ రేంజ్‌లో ఉందో ఊహించుకోవ‌చ్చు. కార్డ్ ఇన్‌విటేష‌న్‌కే ఆయ‌న ఈ స్థాయిలో వ్య‌యం చేస్తుంటే.. ఇక‌, మ్యారేజ్‌కి ఎలాంటి హ‌డావిడి చేస్తాడోన‌ని అంద‌రూ ఆశ్చ‌ర్యంగా చూస్తున్నారు.

క‌న్న‌డ చిత్ర పరిశ్ర‌మ‌లో కార్డ్‌లు పంచిన‌ప్పుడు ఈ విగ్ర‌హాల హంగామా వినిపించ‌లేదు. కానీ, టాలీవుడ్‌కి ఎందుకో స్పెషాలిటీ అర్ధం కాని విష‌యం. అయితే, అక్క‌డ కూడా ఇలాంటి గిఫ్ట్‌నే ఇచ్చాడా? లేక మరొకటి పంచారా…? అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మొత్త‌మ్మీద‌, మొన్న‌టిదాకా స్కామ్‌లు, మైనింగ్ మాఫియా, దోపిడితో సంచ‌ల‌నం.. నేడు కూతురు పెళ్లితో అదే సెన్సేష‌న్‌.. గాలి జ‌నార్ద‌న్ రెడ్డి ఏది చేసినా సంచ‌ల‌నం అనుకోవాలా..? లేక‌, నడ‌మంత్ర‌పు సిరి వ‌స్తే ఇలానే ఉంటుంది అని ఆలోచించాలా..? ఎంత డ‌బ్బుంది ఏముంది..? ఎంజాయ్ చెయ్యాలి కానీ అని స‌రిపెట్టుకోవాలా..? ఏది క‌రెక్ట్‌..?

Loading...

Leave a Reply

*