నోట్ల ర‌ద్దు ఎఫెక్ట్‌ని గాలి గారు భ‌లే త‌ప్పించుకున్నారు…!

untitled-17

పెద్ద నోట్ల ర‌ద్దుకు ముందు దేశ‌వ్యాప్తంగా ట్రెండింగ్‌లో ఉన్న ఒక అంశం.. గాలి జ‌నార్ధ‌న్ రెడ్డి కూతురి వివాహం. వంద‌ల కోట్లు ఖ‌ర్చు చేస్తూ ఈ వివాహాన్ని చేస్తున్నార‌నే ప్ర‌చారం జ‌రిగింది. దేశంలోనే ఈ స్థాయిలో జ‌రిగే వివాహాలు అతి కొద్దిలో ఒకటిగా నిలిచిపోవాల‌ని భావించాడు. అంత‌లోనే, ఉరుములేని పిడుగులా మోదీ త‌న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించాడు. ఈ ఎఫెక్ట్‌తో గాలి కూతురు వివాహం వాయిదా ప‌డే అవకాశం ఉంద‌నే స్థాయిలో ప్ర‌చారం జ‌రిగింది. కానీ, జ‌నార్ద‌న్ రెడ్డి ఒకే ఒక్క అంశం ఆయ‌న‌ను గ‌ట్టెక్కిస్తోంద‌ట‌.

ఇంత‌కీ ఆయ‌న ఏం చేశారంటే.. త‌న కూతురు బ్ర‌హ్మ‌ణి వివాహాన్ని ముందుగానే ఓ మ్యారేజ్ ఈవెంట్ సంస్థ‌కి కాంట్రాక్ట్ ఇచ్చాడ‌ట‌. ఆ సంస్థతో ఆరు నెల‌ల ముందుగానే ఒప్పందం కుదుర్చుకున్నాడ‌ట గాలి జ‌నార్ద‌న్ రెడ్డి. వారికి ముందు చెప్పిన‌ట్లే 500, 1000నోట్ల రూపంలో చెల్లిస్తాన‌ని ఒప్పుకున్నాడ‌ట‌. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో వారు నో చెప్పినా.. ముందు అగ్రిమెంట్ చేసుకున్న దానికంటే కాస్త ఎక్కువ చెల్లించ‌డానికి కూడా రెడీ అయిన‌ట్లు ఒప్పుకున్నాడ‌ట గాలి. దీంతో, పండ‌గ చేసుకున్న ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ‌.. పాత నోట్ల‌ను తామే ఎక్చేంజ్ చేసుకుంటామ‌ని హామీ ఇచ్చింద‌ట‌.

గాలి జ‌నార్ద‌న్ రెడ్డి త‌మ‌కు పాత నోట్లు ఇచ్చినా ఎలాంటి స‌మ‌స్య లేద‌ని వివ‌రించ‌డంతో ఆయ‌న‌కు కూడా పెద్ద గండం త‌ప్పింద‌ని ఊపిరి పీల్చుకున్నాడ‌ట‌.ఆ ఈవెంట్ మేనేజ్‌మెంట్‌కి కొత్త నోట్ల ఎఫెక్ట్‌తో కొన్ని అద‌న‌పు బాధ్య‌త‌లు కూడా అప్ప‌గించిన‌ట్లు స‌మాచారం. ముందుగా ఒప్పందంలో లేని వాటికి కూడా వారు స‌మకూర్చే విధంగా అగ్రిమెంట్‌ని స‌రిచ‌సుకున్నాడ‌ట‌. ఇలా, కూతురి వివాహం ప‌క్కా ప్లాన్ ప్ర‌కారం జ‌రిగేలా చూసుకుంటున్నాడ‌ట‌. సో… ఇన్ని వేల కోట్లు సంపాదించి ఒక్క‌గానొక్క కూతురి వివాహం కూడా భారీగా చేసుకోక‌పోతే ఎందుకు..? అందుకే, ఇంత రిస్క్ తీసుకున్నాడు గాలి.

Loading...

Leave a Reply

*