ఎస్సెమ్మెస్ కొట్టు..1.2 జీబీ డేటా ప‌ట్టు

untitled-15

ఎస్సెమ్మెస్ చెయ్యి… 1.2 జీబీ ఫ్రీ డేటా కొట్టెయ్యి… ఫోన్‌లో మాట్లాడుకో ఆఫ‌ర్ పొందెయ్‌… మా నెట్‌వ‌ర్క్‌లో ఉంటే నీకు బోలెడు లాభాలు… ఆఫ‌ర్లే ఆఫ‌ర్లు… ప్ర‌తిరోజు పండ‌గ చేసుకో…ఇప్పుడు దేశంలో ఈ ట్రెండ్ న‌డుస్తోంది… ఇండియ‌న్ టెలికం రంగంలోకి ముఖేష్ అంబానీ రిల‌య‌న్స్ జియో తుఫాన్‌లా దూసుకువ‌చ్చింది…. ఫ్రీ వాయిస్ కాల్స్‌, ఫ్రీ డేటా అంటూ జ‌నానికి ఫీవ‌ర్ తెప్పించింది… జియో దాదాగిరిని ఎదుర్కొనేందుకు మిగిలిన నెట్‌వ‌ర్క్‌లు కూడా డేటాగిరితో సిద్ధ‌మ‌య్యాయి… జియో ఆఫ‌ర్ల అస్త్రాన్ని అవి కూడా ఆఫ‌ర్ల‌తోనే ఎదుర్కొంటున్నాయి…మ‌రీ ముఖ్యంగా ఎయిర్‌టెల్‌, బీఎస్ఎన్ఎల్ ఉచిత ఆఫ‌ర్ల‌తో హోరెత్తిస్తున్నాయి.. ఎయిర్‌టెల్ మ‌రో అడుగు ముందుకువేసి ఎస్ఎంఎస్ కొట్టు… 1.2 జీబీ డేటా ఫ్రీగా ప‌ట్టు అంటూ తేనెతుట్టె లాంటి ఆఫ‌ర్‌ని అందిస్తోంది…

ఆ ఆఫ‌ర్ వింటే మీరు క్యా యాప్‌రే బాప్‌రే అంటూ ఆనందంతో ఉబ్బిత‌బ్బిబ్బ‌యి పోతారు…అదెలాగంటే ఎయిర్‌టెల్ యాప్స్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకుంటే 1.2 జీబీ డేటా ఉచితంగా పొంద‌వ‌చ్చు. దీనికోసం ఎయిర్‌టెల్ సైట్ నుంచి యాప్ డౌన్‌లోడ్ లింక్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది…. డౌన్‌లోడ్ లింక్ ఓపెన్ చేసి కింద‌కు వెళ్ల‌గానే అక్క‌డ ఎస్ఎంఎస్ కోసం మీ మొబైల్ నెంబ‌ర్‌ని అడుగుతుంది…అది ఎంట‌ర్ చేయ‌గానే నాలుగు యాప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకోమ‌ని మీకు సూచిస్తుంది… ఈ ఎయిర్‌టెల్ యాప్స్‌ని ఒక‌సారి డౌన్‌లోడ్ చేసుకున్నాక మీకు 1.2 జీబీ డేటా ఉచితంగా ల‌భిస్తుంది…అయితే అది ఒక్క‌సారిగా మీ అకౌంట్‌లోకి రాదు… మూడు నెల‌ల కాలంలో ప్ర‌తి యాప్‌కి 100 ఎంబీ చొప్పున మీరు పొందుతారు. సో.. ఎయిర్‌టెల్ యాప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి… 1.2 జీబీ డేటా ఫ్రీగా కొట్టేసి మూవీస్‌తో మ‌స్తుమ‌స్తుగా ఎంజాయ్ చేయండి.

Loading...

Leave a Reply

*