కిటికీ తెరిచి ప‌డుకోండి.. బ‌రువు త‌గ్గుతారు..!

12345

దీనికి దానికి లింకేంటి అనుకుంటున్నారా..? ఇక్క‌డే అస‌లు కిటుకు ఉంద‌ట‌. గ‌తంలో మ‌న పూర్వీకులు రాత్రన‌క‌, ప‌గ‌ల‌న‌కు విప‌రీతంగా శ్ర‌మించేవారు. దీంతో వారిలో ఊబ‌కాయ స‌మ‌స్య‌లు త‌క్కువ‌గా ఉండేవి. ఇప్పుడు మ‌న‌కు శ‌రీరాన్ని శ్ర‌మింప జేసి ప‌నులు చేసే అవ‌స‌రం త‌గ్గిపోయింది. అంతా నోటిదాకా వ‌చ్చేస్తోంది మ‌రి. అంతేకాక‌, వారు ఆరుబ‌య‌ట చ‌ల్ల‌నిగాలికి ప‌డుకునే వారు. మ‌న పూర్వీకులు స‌న్న‌గా ఉండ‌డానికి ఇది కూడా కొంత కార‌ణ‌మట‌. ఈ మాట‌లంటోంది మేము కాదు. ప్ర‌ఖ్యాత ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్శిటీ మేధావులు..

బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు.. ముందుగా వెచ్చ‌గా ప‌డుకోవ‌డానికి దూరంగా ఉండాలంటున్నారు ఆక్స్‌ఫ‌ర్డ్ ప్రొఫెస‌ర్‌లు. నిద్ర‌కు మీరు రెడీ అయ్యేముందు ప‌డ‌క‌గ‌ది కిటికీ తెరిచి పెట్టి ప‌డుకుంటే గ‌ది చ‌ల్ల‌గా మారుతుంది. చ‌ల్ల‌గా ఉండ‌డం వ‌ల్ల కొవ్వు దానంత‌ట అదే క‌రిగిపోతుంద‌ని వారి ప‌రిశోధ‌న‌లో తేలింద‌ట‌.

ప్ర‌తి మ‌నిషి శ‌రీరంలోనూ రెండు ర‌కాల కొవ్వు ఉంటుంది. అవి తెల్ల‌ని కొవ్వు, గోధుమ‌రంగు కొవ్వు. వీటిల్లో ఎక్కువ స‌మ‌స్య‌గా అనిపించేది తెల్ల‌ని కొవ్వు. దీనిలో ఎక్కువ కేల‌రీలు నిలువ ఉంటాయి. ఈ ర‌క‌మైన కొవ్వు పొట్ట‌, న‌డుము, తొడ‌ల వంటి భాగాల్లో ఎక్కువ‌గా నిల్వ ఉంటుంది. గోధుమ వ‌ర్ణ‌పు కొవ్వు ఆరోగ్య‌వంత‌మైన కొవ్వుగా భావిస్తారు. ఇది క‌రిగి కేల‌రీల‌ను త‌గ్గిస్తుంది. మ‌న ఫ్యాటీ బాడీస్‌కి చాలా వ‌ర‌కు క‌రిగిస్తుంది. ఇది శ‌రీరంలో వేడి పుట్టిస్తుంది.

అదృష్ట‌వ‌శాత్తు శ‌రీరానికి అవ‌స‌ర‌మున్న‌ప్పుడు తెల్ల‌ని కొవ్వు కూడా గోధుమ‌రంగు కొవ్వుగా మారుతుంది. అంటే, చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణంలో తెల్ల‌ని కొవ్వు గోధుమ‌రంగులోకి మారి శ‌రీర‌పు ఉష్ణోగ్ర‌త‌ను స్థిరంగా ఉంచి వేడి పుట్టిస్తుంది. అందుకోసం కొంత కొవ్వు క‌రిగి శ‌రీరంలో వేడి పుడుతుంది. అందుకు కొన్ని కేల‌రీల శ‌క్తి కూడా వినియోగం అవుతుంది కాబ‌ట్టి ఎలాంటి ప్ర‌య‌త్నం లేకుండానే కొంత బ‌రువు త‌గ్గించ వ‌చ్చు అనేది ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్శిటీ ప్రొఫెస‌ర్‌ల వాద‌న‌. అన్ని మూసిన వెచ్చని గదిలో కాకుండా కిటికీలు తెరచిన చల్లని గదిలో పడుకొని శరీర బరువు నియంత్రణలో ఉంచుకోవచ్చన్న మాట. అందుకే, మ‌న పెద్దోళ్లు.. చ‌ల్ల‌ని గాలి పోసుకోవాల‌ని చెబుతారు. మ‌రి, మ‌న సిటీల‌లో అది కుదురుతుందా చెప్పండి..?

Loading...

Leave a Reply

*