గాలి వారి పెళ్లి హంగామాని అక్కినేని వారి ఎంగేజ్‌మెంట్ బీట్ చేస్తుందా…?

untitled-10-copy

బెంగ‌ళూరులో గాలి ఇంట పెళ్లి సంబ‌రం ముగిసింది. నోట్ల ర‌ద్దు సంక్షోభంలోనూ గాలి జ‌నార్ద‌న్ రెడ్డి వంద‌ల కోట్లు ఖ‌ర్చు పెట్టి అంగ‌రంగ వైభ‌వంగా పెళ్లి చేసి త‌నేమిటో నిరూపించుకున్నాడు. కొన్నేళ్లు జైలులో ఉండి వ‌చ్చిన్ప‌ప్ప‌టికీ… రాజ‌కీయంగా అంద‌రూ దూర‌మైన‌ప్ప‌టికీ… గాలి మాత్రం నిశ్చింతగా త‌న కుమార్తె పెళ్లిని చేశారు. గాలి విష‌యం పార్ల‌మెంట్‌లో ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చినా ఈ మైనింగ్ టైకూన్ బేషిక‌ర్ అన్నారు.

దాంతో గ‌త వారం మొత్తం గాలి పెళ్లే మీడియాలో హైలెట్ అయ్యింది. ఇది ముగిసింది. ఇప్పుడు వంతు అక్కినేని కుటుంబానికి వ‌చ్చింది. డిసెంబ‌రులో అక్కినేని వారింట పెళ్లీ బాజా మోగ‌నుంది. నాగార్జున త‌న‌యుడు అఖిల్ నిశ్చితార్థ వేడుక ఇక్క‌డే జ‌ర‌గ‌నుంది. నాగార్జున ఆల్రెడీ ఆహ్వానాలు పంచ‌డం మొద‌లైంది. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కూడా పిలిచారు. అఖిల్ చేసుకోబోతున్న‌ది జీవీకే కుటుంబానికి చెందిన అమ్మాయి.

జీవీకే ఫ్యామిలీ కూడా దేశంలోని బిగ్‌షాట్స్‌లో ఒక‌టి. దాంతో ఇప్పుడీ నిశ్చితార్థం కూడా హైద‌రాబాద్ అదిరిపోయేలా చేస్తార‌ని టాక్ న‌డుస్తోంది. ఎటూ పెళ్లీ అఖిల్ ఇష్టం ప్ర‌కారం ఈ దేశంలోనే చేయ‌డం లేదు. దాంతో ఇక్క‌డ చేస్తున్న వేడుక నిశ్చితార్థ‌మే కాబ‌ట్టి దానినే అంగ‌రంగ‌వైభ‌వంగా ప‌ది రోజులు అంద‌రూ దాని గురించే మాట్లాడుకునేలా చేయాల‌ని నాగార్జున కుటుంబం భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

Loading...

Leave a Reply

*