షాక్‌..జుక‌ర్‌బ‌ర్గ్‌ని చంపేసిన ఫేస్‌బుక్ కంపెనీ ఉద్యోగులు….!

facebook-ceo-jukerberg-was-killed-by-employees-in-a-technical-mistake

ఫేస్‌బుక్ సీఈవో చ‌నిపోయాడా..? ఎప్పుడు..? ఎక్క‌డ‌..? ఎలా..? మోదీ విసిరిన క‌రెన్సీ స‌మ‌స్య‌ల‌తో మ‌న‌కు ఈ న్యూస్ రాలేదేంట‌ని బాధ‌ప‌డుతున్నారా..? అయితే, కంగారు ప‌డాల్సిందేమీ లేదు. ఇక్క‌డ ఓ చిన్న టెక్నిక‌ల్ మిస్టేక్‌తో ఇలా జ‌రిగింది.

జుక‌ర్‌బర్గ్‌.. ఫేస్‌బుక్ చూసేవారికి ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. పాతికేళ్ల వ‌య‌సుకే.. ప్ర‌పంచ టాప్ 10 కుబేరుల్లో స్థానం ద‌క్కించుకున్నాడు. ఆయ‌న సాధించిన రికార్డ్‌లు అన్నీ ఇన్నీ కావు. ల‌క్ష‌ల కోట్లు సంపాదించిన జుక‌ర్ బ‌ర్గ్‌.. ఇటు సామాజిక సేవ‌లోనూ ముందుంటున్నారు. అయితే, ఫేస్‌బుక్ కంపెనీ ఉద్యోగులు.. ఆయ‌న‌ను త‌ప్పుగా చ‌నిపోయిన వారి జాబితాలో చేర్చి షాక్ ఇచ్చింది. చిన్న సాంకేతిక మిస్టేక్‌తో ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్‌ని ఈ లిస్ట్‌లో జాయిన్ చేసింది. అంతేకాదు, మార్క్ అభిమానులంతా ఆయ‌న ఫేస్‌బుక్ పోస్ట్‌ల‌ను గుర్తు చేసుకుందాం.. అత‌డిని ఓ సారి స్మ‌రించుకుందాం.. అంటూ ఫేస్‌బుక్ జుక‌ర్ బర్గ్ ప్రొఫైల్‌కి చేసిన పోస్ట్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌ల‌కాలం రేపింది.

కొంత సేప‌టి త‌ర్వాత త‌ప్పు తెలుసుకొని వెంట‌నే స‌రిదిద్దుకుంది. అంత‌లోనే ఫేస్‌బుక్ ఫాలోవ‌ర్స్ నుంచి భారీగా సందేశాలు వ‌చ్చాయి. కొంత‌మంది ఆయ‌న‌కు సానుభూతి తెలిపితే, మ‌రికొంత‌మంది ఇది అబ‌ద్ధ‌మ‌ని తెలిసి సెటైర్‌లు వేశారు. ఆ త‌ర్వాత ఫేస్‌బుక్ యాజ‌మాన్యం ఇది ఘోరత‌ప్పిదంగా భావించి క్ష‌మాప‌ణ‌లు కోరింది. నిముషాల‌లోనే జుక‌ర్‌బ‌ర్గ్‌కి దాదాపు 25 ల‌క్ష‌ల మంది సంస్మ‌ర‌ణ సందేశాలు పంపించారు. ఈ మిస్టేక్‌పై చాలామంది వేగంగా రియాక్ట్ అయ్యారు. ఫేస్‌బుక్ జ‌నాల‌కి అంత‌బాగా క‌నెక్ట్ అయింది. అందుకే, జుకర్‌బ‌ర్గ్‌కి అంత ఫాలోయింగ్ మ‌రి.

 

Loading...

Leave a Reply

*