బాల‌య్య‌కు కేసీఆర్ పొంగ‌ల్‌ గిఫ్ట్ ఇస్తాడా..?

balayya

బాల‌య్య ప్ర‌స్తుతం 100వ సినిమాలో న‌టిస్తున్నాడు. ఇది ఆయన కెరీర్‌లోనే ప్ర‌తిష్టాత్మ‌క మూవీ. ఈ సినిమాని ప్రిస్టీజియ‌స్‌గా తీసుకున్నాడు నంద‌మూరి హీరో. అయితే, శాత‌క‌ర్ణి కోసం బాల‌య్య స్పెష‌ల్ స్కెచ్ వేస్తున్నాడ‌ట‌. ఈ సినిమా చారిత్ర‌క నేప‌థ్యంలో తెర‌కెక్క‌నుంది. అందులోనూ ఆంధ్రుల చ‌రిత్ర‌ను ప్ర‌పంచ‌వ్యాప్తంగా చాటిన శాత‌వాహ‌నుల రాజు గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి జీవిత గాథ ఇది. ఈ సినిమాకి అటు ఏపీతోనూ, ఇటు తెలంగాణ‌తోనూ విడ‌దీయ‌రాని బంధం ఉంది. శాత‌వాహ‌నుల పుట్టు పూర్వోత్త‌రాల‌తో తెలంగాణ‌కి లింక్ ఉంటే… వారి రాజ‌ధానిగా ప‌రిపాలించిన అమ‌రావ‌తితో వారికి అనుబంధం ఉంది. ఇలా ఇటు తెలంగాణ, అటు ఆంధ్ర‌తో వారికి సంబంధం ఉంది.

దీంతో ఈ సినిమాకి ట్యాక్స్ మిన‌హాయింపు ఇవ్వ‌మ‌ని ఇద్ద‌రు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌ను బాల‌కృష్ణ అడగాల‌ని భావిస్తున్నార‌ట‌. ఏపీలో ప్ర‌భుత్వం వారిదే క‌నుక స‌మ‌స్య‌లేదు. కానీ, తెలంగాణ‌లో టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఉంది. దీనికి కేసీఆర్ ఏమంటారో అనేది కీల‌కంగా మార‌నుంది. గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమా ఓపెనింగ్‌కి కేసీఆర్ వ‌చ్చారు. ఇటు, కేసీఆర్ ఫ్యామిలీతో బాల‌య్య‌కు మంచి అనుబంధ‌మే ఉంది. సో.. ట్యాక్స్ మిన‌హాయింపు అడిగినా కాద‌న‌ర‌ని భావిస్తున్నారట గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమా యూనిట్ స‌భ్యులు.

మ‌రోవైపు, ఇప్ప‌టికే ఆంధ్రుల చారిత్రక నేప‌థ్యంలో తెర‌కెక్కిన రుద్ర‌మ‌దేవి సినిమాకి తెలంగాణ స‌ర్కార్ ప‌న్ను మిన‌హాయింపు ఇచ్చింది. ఇది కూడా వారిని టెంప్ట్ చేస్తోంద‌ట‌. ప‌న్ను మిన‌హాయింపు సినిమాకి మంచి లాభం చేకూరుతుంద‌ని, ఈ జానర్ సినిమ‌ల‌ను ప్రోత్స‌హించిన‌ట్లు అవుతుంద‌ని వారు చెబుతున్నారు. మ‌రి, సంక్రాంతి నాటికి కేసీఆర్ బాల‌య్య‌కు ఆ గిఫ్ట్ ఇస్తారా..? లేదా.. ? అనేది చూడాలి.

Loading...

Leave a Reply

*