న‌యీంకు డాక్ట‌ర్ల స‌లాం!

untitled-14

న‌యీం అరాచాకాల‌కు వ‌త్తాసు ప‌లికిన వాళ్ల‌లో ఇప్పుడు కొత్త వ‌ర్గం వ‌చ్చి చేరింది. న‌యీంను పెంచి పోషించింది పోలీసులు. అయితే అత‌డి దందాల‌కు స‌హ‌క‌రించి స‌మాజానికి చీడ‌గా మార్చింది రాజ‌కీయ నాయ‌కులు. ఈ న‌ర‌రూప రాక్ష‌సుడికి భ‌య‌ప‌డి కొంత‌…. త‌మ దందాలు నిరాటంకంగా సాగించుకునేందుకు కొంత రాజ‌కీయ నాయ‌కులు న‌యీంకు తోడు నీడ‌గా ఉన్నారు. ఇప్ప‌టికే న‌యీం డైరిలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పోలీసు ఉన్న‌తాధికారుల పేర్లు ఉన్నాయ‌న్న వార్త‌లొచ్చాయి. వారిలో ఎవ‌రినీ వ‌దిలిపెట్ట‌వ‌ద్ద‌ని కేసీఆర్ కూడా పోలీసుల‌కు తేల్చి చెప్పార‌న్న విష‌య‌మూ విధిత‌మే. న‌యీం వ్య‌వ‌హారంలో ఒక‌రిద్ద‌రు పార్టీ నేత‌ల‌ను వ‌దులుకునేందుకు కూడా కేసీఆర్ సిద్ధమ‌య్యారు. సీఎం కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో సిట్ పోలీసులు కూడా త‌మ ప‌ని ఉదృతం చేశారు.

ఈ క్ర‌మంలోనే న‌యీంకు వంత‌పాడిన వాళ్లలో డాక్ల‌ర్లు కూడా ఉన్నార‌న్న విష‌యం బ‌య‌ట‌కొచ్చింది. న‌యీం చేసిన హ‌త్య‌ల‌కు త‌మ వంతు సాయంగా సాధార‌ణ మ‌ర‌ణాలంటూ క‌ల‌రింగ్ ఇచ్చార‌ని తాజాగా తేలింది. న‌యీం చేతిలో చ‌నిపోయిన కొంద‌రి వ్య‌వ‌హారంలో వైద్యులు పోస్టుమార్టం నివేదిక‌ల‌ను మార్చి వేశార‌ని తేల‌డంతో ద‌ర్యాప్తు బృందం ఇప్పుడు ఆ దిశ‌గా విచార‌ణ ముమ్మ‌రం చేసింది. న‌యీం త‌ప్పించుకునేందుకు అనుకూలంగా పోస్టుమార్టం నివేదిక‌ల్లో హ‌తులైన వారు సాధార‌ణ కార‌ణాల‌తో మ‌ర‌ణించిన‌ట్లు కొంద‌రు వైద్యులు వెల్ల‌డించార‌ని తాజా స‌మాచారం. విచార‌ణ ఇంకా కొన‌సాగే కొద్ది మ‌రెంత‌మంది న‌యీంకు స‌హ‌క‌రించిన వారు బ‌య‌ట‌కు వ‌స్తారోమ‌రి.

Loading...

Leave a Reply

*