న‌ర్సు కోసం డాక్ట‌ర్ పాయిజ‌న్ ఇంజ‌క్ష‌న్‌

doctor

ప్రేమ విఫ‌లైమ‌న డాక్ట‌రు విష‌పు ఇంజ‌క్ష‌న్ తీసుకుని త‌నువు చాలించాడు. ఈ సంఘ‌ట‌న మ‌ధుర‌లో చోటు చేసుకుంది. నగ‌రంలోని మిల‌ట‌రీ ఆస్ప‌త్రిలో లెఫ్ట్‌నెంట్ క‌ల్న‌ల్‌గా ప‌నిచేస్తున్న డాక్ట‌ర్ జాఘ‌వ్ అదే ఆస్ప‌త్రిలో ప‌ని చేస్తున్న ఒక న‌ర్సును కొన్నాళ్లుగా ప్రేమిస్తున్నాడు. అయితే, ఈ డాక్ట‌ర్‌ది ఏక‌ప‌క్ష ప్రేమ కావ‌డం గ‌మ‌నార్హం. జాఘ‌వ్‌కు గ‌తంలోనే పెళ్లై ఇద్ద‌రు పిల్లలుండ‌డం మ‌రో విశేషం. ఇద్దరు పిల్లలున్న డాక్టరు త‌న‌ను ప్రేమిస్తున్నాన‌ని చెప్ప‌డంతో ఆ న‌ర్సు అత‌డిని తిర‌స్క‌రించింది. దాంతో ఆమెను మాయ మాట‌లు చెప్పి ఒక మారుమూల ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్క‌డ ఆ న‌ర్సుపై జాఘ‌వ్ అత్యాచార య‌త్నానికి ఒడిగ‌ట్టాడు. ఆ నర్సు డాక్టర్ బ‌ల‌త్కారాన్ని అడ్డుకుంది. ఈ ఘటన త‌ర్వాత డాక్ట‌ర్ జాఘ‌వ్ ఇంటికి తిరిగివచ్చి పాయిజ‌న్ ఇంజక్షన్ చేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. జాఘవ్ తన పై అధికారి కావడంతో ఆయన పిలిచిన ప్రాంతానికి వెళ్లాన‌ని అతడు ఇంత దారుణంగా ప్ర‌వ‌ర్తిస్తాడ‌ని అనుకోలేద‌ని న‌ర్సు పోలీసుల‌కు వెల్ల‌డించారు. ఈ సంఘ‌ట‌న‌పై మిల‌ట‌రీ అధికారులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Loading...

Leave a Reply

*