మంచి ఫోన్ కొనాలంటే దీపావళి లోపు కొనుక్కోండి…

diwali-offers

స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా.. కానీ కాస్త చవగ్గా వస్తూ, ఎక్కువ ఫీచర్లు కావాలని కోరుకుంటున్నారా.. అయితే మీరు ఇంకాస్త స్మార్ట్ గా ఆలోచించాల్సిందే. మీ స్మార్ట్ నెస్ కు ఈ దీపావళి సీజన్ ను కూడా యాడ్ చేశారంటే… అతి తక్కువ ధరకే, ఎక్కువ ఫీచర్లు కలిగిన అద్భుతమైన స్మార్ట్ ఫోన్ ను దక్కించుకోవచ్చు. మీరు చేయాల్సిందల్లా.. జస్ట్ నెట్ లో జాగ్రత్తగా సెర్చ్ చేయడమే.దీపావళి ఆఫర్లలో భాగంగా వన్ ప్లస్ అనే సంస్థ ఇప్పటికే ఓ ఆఫర్ పెట్టింది. తమ వెబ్ సైట్ లో రిజిస్టర్ చేయించుకొని కేవలం 1 రూపాయికే స్మార్ట్ పోన్ దక్కించుకోండంటూ ఊరిస్తోంది. రిజిస్ట్రేషన్ ఎలాగూ ఫ్రీ కాబట్టి.. ఈ దారిలో ప్రయత్నించవచ్చు.

అక్టోబర్ 24 నుంచి 26వరకు ప్రతి రోజు 4గంటలకు, 6 గంటలకు, 8 గంటలకు ఈ ఫ్లేష్ సేల్ మొదలవుతుంది. ప్రతి రోజు.. ఇలా రోజుకు 3 సార్లు చొప్పున, వరుసగా 3 రోజులు ఉంటుంది. సో.. అవకాశాలు ఎక్కువే.నిజానికి ఈ బంపర్ ఆఫర్ జియోమీ కంపెనీది. గతేడాది ఆ కంపెనీనే ఈ ఫార్ములాను తెరపైకి తెచ్చింది. ఈసారి కూడా జియోమీ రెడ్ మి కంపెనీ దీన్ని మళ్లీ ప్రారంభించింది. ఆ సంస్థ సైట్ లో దీన్ని కూడా ట్రైచేయొచ్చు.

ఈసారి కేవలం 1 రూపాయి ఫ్లాష్ సేల్ మాత్రమే కాకుండా… తమ ఉత్పత్తులపై కొన్ని పోటీలు పెట్టి, గెలిచిన వాళ్లకు 3వేలు, 5వేలు, 1500 రూపాయల డిస్కౌంట్లు కూడా ప్రకటించింది. సో.. ఈ సైట్ నుంచి కూడా కొనే ప్రయత్నం చేయొచ్చు. మరోవైపు అమెజాన్, స్నాప్ డీల్, ఫ్లిప్ కార్టుల్లో కూడా ఆన్ లైన్ ఆఫర్లు వచ్చేశాయి. ఇవి కాకుండా బయట ఉన్న సంగీత, బిగ్-సి, యూనివర్సల్ లాంటి షాపుల్లో కూడా ఆఫర్లు బాగానే ఉన్నాయి. కాస్త ఓపిగ్గా ప్రయత్నిస్తే.. మంచి స్మార్ట్ ఫోన్ దక్కించుకోవడానికి ఈ దీపావళికి మించిన సీజన్ లేదు.

Loading...

Leave a Reply

*