కూతురి పెళ్లి కోసం ఆస్తులు తాక‌ట్టు పెట్టిన గాలి… న‌మ్మాలంటారా..?

gali

770 ఎక‌రాల సువిశాల మైదానంలో భారీ సెట్టింగుల‌తో ఏర్పాటు చేసిన ఒక మ‌హాన‌గ‌రంలో గాలి జ‌నార్ద‌న్ రెడ్డి కుమార్తె వివాహం జ‌రుగుతోంది. మైనింగ్ అక్ర‌మాల కేసులో బెయిల్‌పై బ‌య‌ట ఉన్న గాలి జ‌నార్ద‌న్ రెడ్డి త‌న కూతురి పెళ్లి కోసం దాదాపు వంద కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేస్తున్నార‌ని ప్ర‌చారం జ‌ర‌గుతోంది. ఇంత పెద్ద మొత్తంలో నిధుల‌ను స‌మీకరించుకునేందుకు గాలి త‌న ఆస్తుల‌ను కుదువ పెట్టిన‌ట్లు ఒక క‌థ‌నం.

క‌ర్ణాట‌క‌లోని ప‌ది ఆస్తుల‌తో పాటు, సింగ‌పూర్‌లో ఉన్న ఒక భ‌వంతి కూడా గాలి తాక‌ట్టు పెట్టిన జాబితాలో ఉన్నాయని వార్త‌లొస్తున్నాయి. ఇలా స‌మీక‌రించుకున్న డ‌బ్బుతో బెంగ‌ళూరు ప్యాలెస్‌ను అంగ‌రంగ వైభ‌వంగా తీర్చి దిద్దారు. హంపిలోని విఠలేశ్వర ఆలయాన్ని పోలిన సెట్‌తో పాటు… గాలి సొంత ఊరైన బళ్లారిలోని కౌల్‌ బజార్‌, దానప్పబీడి వీధిలు, ఆయన చదువుకున్న పాఠశాల సెట్టింగ్‌లను ఏర్పాటు చేశారు. వధూ వరుల కోసం ఆవరణలోనే 2 విలాసవంతమైన భవనాలను తాత్కాలికంగా నిర్మించారు.

అలాగే వ‌స్తున్న అతిథుల కోసం పెద్ద‌పెద్ద హోట‌ళ్ల‌లో విడిది ఏర్పాట్లు చేశారు. వివాహం జరుతున్న వేదిక ప్రాంగ‌ణంలో వీడియోలు తీయ‌రాద‌ని బోర్డులు ఏర్పాటు చేశారు. లోప‌ల ఏం జ‌రుగుతుందో బ‌య‌ట ప్ర‌పంచానికి తెలియ‌కుండా ఉండేదుకే గాలి ఈ జాగ్ర‌త్త‌లు తీసుకున్నారేమో. వివాహ ప్రాంగ‌ణంలో భ‌ద్ర‌త కోసం 3000 మంది బౌన్స‌ర్ల‌ను గాలి ఏర్పాటు చేశారు. అలాగే, డ‌బ్బులు చెల్లించే ప్రాతిప‌దిక‌న క‌ర్ణాట‌క పోలీసుల సేవ‌లు కూడా వినియోగించుకుంటున్నారు.

Loading...

Leave a Reply

*