ప‌క్కింటావిడ‌ను కొట్టిన ధోనీ

dhoni

ధోనీ ప‌క్కింటావిడ‌ను కొట్టాడు… చావ‌చిత‌క కొట్టాడు… త‌న త‌ల్లిని కొట్టింద‌న్న కోపంతో చిందులు తొక్కాడు…. ప‌క్కింటావిడ ఇంట్లోకి పారిపోవ‌డంతో క‌త్తి తీసుకుని ఆమె వెంటప‌డ్డాడు.. చంపేస్తా న‌రికేస్తా అంటూ వీరంగం సృష్టించాడు… ప‌క్కింటావిడ త‌లుపులు వేసుకుని దాక్కోవ‌డంతో త‌లుపులు బ‌ద్ద‌లు కొట్ట‌డానికి ప్ర‌య‌త్నించాడు… అయితే ఆ త‌లుపుల‌ను విర‌గ్గొట్ట‌డం ధోనీ వ‌ల్ల కాలేదు… వెంట‌నే అపార్ట్‌మెంట్ బిల్డింగ్ ఎక్కి స్పైడ‌ర్‌మ్యాన్‌లా పాకుతూ బాల్క‌నీలో నుంచి ప‌క్కింటావిడ ఇంట్లోకి చొర‌బ‌డ‌డానికి ప్ర‌య‌త్నించాడు… అయితే అక్క‌డ ఐర‌న్ గ్రిల్స్ ఉండ‌డంతో ధోనీ ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు…

ధోనీ క‌త్తి ప‌ట్టుకుని సైలెంట్‌గా స్పైడ‌ర్‌మ్యాన్‌లా గోడ‌లు ప‌ట్టుకుని పాకుతూ రావ‌డాన్ని గ‌మ‌నించిన ప‌క్కింటావిడ ప‌రేషాన్ అయిపోయింది… వెంట‌నే పోలీసులకు ఫోన్ చేసింది…పోలీసులు వ‌చ్చి ధోనీకి బేడీలు వేసి అరెస్ట్ చేసి జైల్లో పారేశారు… అస‌లు క‌థ ఏంటంటే ముంబైలోని భ‌యంద‌ర్‌లోని ప్లాన‌టేరియా కాంప్ల‌క్స్‌లో నివాసం ఉండే ధోనీ గోపాల్ అనే యువ‌కుడి త‌ల్లికి పొరుగింట్లో ఉన్న మ‌హిళ‌తో గొడ‌వ అయింది… దీంతో ఆ ప‌క్కింటి మ‌హిళ ధోనీ గోపాల్ త‌ల్లిపై చేయి చేసుకుంది.. ఈ విష‌యం తెలుసుకున్న గోపాల్ త‌ల్లికి అవ‌మానం జ‌రిగిందంటూ త‌ల్ల‌డిల్లిపోయాడు….

ఆవేద‌న కాస్తా ఆక్రోశంగా మారి ఆగ్ర‌హంగా ప‌రిణ‌మించ‌డంతో ప్ర‌తీకారం తీర్చుకోవ‌డానికి క‌త్తి తీసుకుని ప‌క్కింటావిడ ఫ్లాట్‌కి వెళ్లాడు… ఆమె త‌లుపు తీయ‌క‌పోవ‌డంతో బాల్క‌నీ నుంచి మూడంత‌స్తుల భ‌వ‌నం ఎక్కి ప‌క్కింటావిడ ఇంటి వెనుక భాగానికి చేరుకుని బాల్క‌నీ ద్వారా ఇంట్లోకి చొర‌బ‌డే ప్ర‌య‌త్నం చేశాడు… అది సాధ్యం కాక‌పోవ‌డంతో క‌త్తితో కిటికీని ధ్వంసం చేశాడు…. దీంతో ప‌క్కింటావిడ పోలీసుల‌కు ఫోన్ చేయ‌డంతో వాళ్లు వ‌చ్చి ధోనీ గోపాల్‌ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు.. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైర‌ల్‌గా మారాయి.

Loading...

Leave a Reply

*