చిల్ల‌ర క‌ష్టాలు ఎన్నాళ్లంటే.. విని మోదీ కూడా షాక్‌…!

untitled-5

నోట్ల ర‌ద్దుతో దేశ‌మంతా ఇప్పుడు బ్యాంకుల బాట ప‌ట్టింది. మొత్తం 125 కోట్ల జ‌నాభాలో వంద కోట్ల మంది బ్యాంకులు, ఏటీఎంల వ‌ద్ద క్యూ లైన్ల‌లోనే గ‌డుపుతున్నారు. పిల్లా జెల్లతో ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా ర‌ద్ద‌యిన నోట్లు ప‌ట్టుకుని బ్యాంకు గుమ్మం ముందు నిలుచుంటున్నారు. ఆరు రోజులుగా ఈ ప‌రిస్థితి కొన‌సాగుతూనే ఉంది. అదే ఇప్పుడు మోడీపై ఆగ్ర‌హానికి కార‌ణ‌మ‌వుతోంది. చాలిన‌న్ని నోట్లు అందుబాటులో ఉంచ‌కుండా… అవ‌స‌ర‌మైన ఏర్పాట్లు చేయ‌కుండా ఇలాంటి నిర్ణ‌యం ప్ర‌క‌టించ‌డంపై ఇప్పుడు జనం మోడీపై మండిప‌డుతున్నారు. ఇక‌, ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దేందుకు రంగంలోకి దిగిన కేంద్రం దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్టింది. మ‌రో రెండు మూడు వారాల్లో అంతా స‌ర్దుకుంటుంద‌ని చెబుతోంది.

అయితే, బ్యాంకింగ్ నిపుణులు, ఏటీఎంలు నిర్వ‌హించే కంపెనీలు చెబుతున్న ప్ర‌కారం జ‌నానికి మ‌రో రెండు నెల‌ల పాటు ఈ పాట్లు త‌ప్ప‌వ‌ని అర్థ‌మ‌వుతోంది.కేంద్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి శ‌క్తికాంత్ దాస్ చెప్పిన ప్ర‌కారం దేశంలోని ఏటీఎంలలో ఉన్న సాఫ్ట్‌వేర్‌ను హార్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయాల్సి ఉంది. అందులోని ట్రేలు ఇప్పుడు వ‌స్తున్న కొత్త నోట్ల‌కు అనుగుణంగా మార్చాల్సి ఉంది. దాన్ని వీలైనంత తొంద‌ర‌గా పూర్తి చేస్తామ‌ని ఆయ‌న చెప్పారు. అయితే, వాస్త‌వంగా క్షేత్ర‌స్థాయిలో ఆ ప‌నిలో నిమ‌గ్న‌మై ఉన్న కంపెనీలు చెబుతున్న మాట మాత్రం వేరే దేశంలోని 2.25 ల‌క్ష‌ల ఏటీఎంల‌ను ఆప్‌డేట్ చేయాలంటే మ‌రో నెల‌న్న‌ర నుంచి రెండు నెల‌లు ప‌డుతుంద‌ని.

అంటే ఏటీఎంలు బాగ‌య్యి… కావాల్సినంత న‌గ‌దును ఉప‌సంహ‌రించుకునే వెసులుబాటు వ‌చ్చి జ‌నం చేతిలో డ‌బ్బులు గ‌తంలోలా తిర‌గ‌లాంటే మ‌రో నాలుగైదు నెల‌లు ఆగాల్సిందే. అప్ప‌టి వ‌ర‌కూ ఈ సంక్షోభం కొన‌సాగాల్సిందే. మినిమమ్‌ జ‌న‌వ‌రి వ‌ర‌కూ మాత్రం బ్యాంకుల ముందు జ‌నం బారులు తీరాల్సిందే. మోదీ నిర్ణ‌యం తీసుకునే స‌మ‌యంలో ఈ విష‌యం ఆయ‌న‌కు కూడా అప్పుడు అర్ధం కాలేద‌ట‌. కానీ, వాస్త‌వంగా అన్ని స‌మ‌స్య‌లు ప్ర‌జ‌ల ముందుకు రావ‌డంతో మోదీ కూడా వ్య‌వ‌స్థ‌ను వేగ‌వంతం చేయాల‌ని ఆదేశిస్తున్నాడ‌ట‌. మొత్తం వ్య‌వ‌స్థ మునుప‌టిలా రావాలంటే అప్ప‌టిదాకా వెయిట్ చెయ్య‌క త‌ప్ప‌దంటున్నారు మేధావులు. మ‌రి, జ‌నాల‌కు అంత ఓపిక ఉంటుందా..?

Loading...

Leave a Reply

*