కాల్ క‌ల‌వ‌నిదెందుకు? వినియోగ‌దారుల‌కు జీయో క‌ష్టాలు

jio

ఆర్భాటంగా ప్ర‌క‌టించిన రిల‌య‌న్స్ ప్ర‌క‌టించిన జియో ఇప్పుడు చుక్క‌లు చూపిస్తోంది. కాల్స్ క‌ల‌వ‌క వినియోగ‌దారులు అల్లాడిపోతున్నారు. ఎప్పుడో ఓసారి క‌లిసే కాల్ కోసం క‌ళ్లు కాయ‌లుకాచేలా ఫోన్ స్క్రీన్ వైపే చూస్తున్నారు. జియోక‌ష్టాల‌కు కాల్స్ క‌ల‌వ‌క‌పోవ‌డానికి టెలికం సంస్థ‌లు ఒక‌రిపై మ‌రొక‌రు నింద‌లేసుకుంటూ కాలం గ‌డిపేస్తున్నారు. ఇప్ప‌టికే ముఖేశ్ అంబానీ ఈ విష‌యంలో ఎయిర్‌టెల్‌ను దోషి చేసేందుకు శ‌త‌విధాల ప్ర‌య‌త్నిస్తున్నారు. కావాల‌నే జియో వినియోగ‌దారుల‌ను ఇబ్బంది పెడుతుంద‌ని ముఖేశ్ ఆరోపిస్తున్నారు. ఎయిర్‌టెల్ మాత్రం రిల‌య‌న్స్ ఆరోప‌ణ‌ల‌ను ఖండిస్తోంది.

ఇక గ‌త ప‌ది రోజుల వ్య‌వ‌ధిలోనే వొడాఫోన్ నెట్‌వ‌ర్క్ నుంచే 15 కోట్ల కాల్స్ ఫెయిల్ అయిన‌ట్లు తెలిసింది. జియో నుంచి వొడాఫోన్‌కు వెళ్లే ప్ర‌తి వంద కాల్స్‌లో 80 ఫెయిల్ అవుతున్నాయ‌ని తేలింది. రోజుకు ఈ స‌మ‌స్య‌తో ఐదు ల‌క్ష‌ల‌మంది వినియోగ‌దారులు ఇబ్బంది ప‌డుతున్నార‌ని స‌మాచారం. ఎయిర్‌టెల్ స‌హా అన్ని నెట్‌వ‌ర్కులు త‌మ వినియోగ‌దారుల‌ను ఇబ్బంది పెడుతున్నాయ‌ని ముఖేశ్ అంబానీ చెబుతున్నారు. ఇప్ప‌టికే ఈ విష‌య‌మై ట్రాయ్‌కు కూడా రిల‌య‌న్స్ ఫిర్యాదు చేసింది. గత 15 రోజుల్లో ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఐడియాలు తొమ్మిది కొత్త పాయింట్స్‌ ఆఫ్‌ ఇంటర్‌ కనెక్ట్‌ను మాత్ర‌మే కేటాయించినట్టు రిల‌య‌న్స్ వెల్ల‌డించింది.

ఒక్కో ఆపరేటర్‌ 4 వేల నుంచి 5 వేల పిఒఐలు కేటాయించాల్సి ఉండగా, ఈ నెలలో ఎయిర్‌ టెల్‌ ఒక పిఒఐని మాత్రమే కేటాయించిందనీ దీనితో మొత్తం పిఒఐల సంఖ్య 651కి చేరిందని రిల‌య‌న్స్ చెబుతోంది. ముఖేవ్ ఆరోపణలను ఇతర ఆపరేటర్లు తోసిపుచ్చుతున్నారు. ఇప్ప‌టికే 2100 పీఒఐలు ఇచ్చామ‌ని, మ‌రో వెయ్యి పీఒఐలు ప్రాసెస్‌లో ఉన్నాయ‌ని ఎయిర్‌టెల్ ప్ర‌క‌టించింది. ఎవ‌రి వాద‌న ఎలా ఉన్నా జియో క‌స్ట‌మ‌ర్లు మాత్రం ఫోన్లు క‌ల‌వ‌క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Loading...

Leave a Reply

*