జ‌నం ఐడీల‌తో బ్యాంకుల‌తో దొంగ దందా!

untitled-7

న‌ల్ల నోట్ల ర‌ద్దు కోసం ప్ర‌భుత్వం పెట్టిన నిబంధ‌న‌ల‌ను కొంద‌రు బ్యాంకు అధికారులు త‌మ‌కు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ప్ర‌జ‌లిచ్చిన ఐడీల‌తో న‌ల్ల దందాలు చేస్తున్నారు. బారెడు క్యూల‌లో నిలుచుని కౌంట‌ర్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన జ‌నానికి మీ ఐడీ చెల్ల‌ద‌ని, దాన్ని ఇప్ప‌టికే వినియోగించేశార‌ని చెబుతున్నారు. త‌మ ఐడీ వినియోగించ‌డ‌మేంట‌ని ప్ర‌శ్నించిన పౌరుల‌కు తాము చేయ‌గ‌లిగింది ఏమీ లేద‌ని స‌మాధానమిస్తున్నారు.

దీని వెనుక పెద్ద స్కాం జ‌రుగుతోంది. సాధార‌ణ జ‌నానికి చెందిన ఐడీల‌ను ఉప‌యోగించి కొంద‌రు బ్యాంకు సిబ్బంది న‌ల్ల‌ధ‌నం కూడ‌బెట్టిన వారితో కుమ్మ‌క్కై డ‌బ్బు మార్పిడి చేస్తున్నారు. ఈ దారుణంపై నేష‌న‌ల్ మీడియా ఒక‌టి స్టింగ్ ఆప‌రేష‌న్ చేసింది. అందులో క‌ళ్లు తిరిగే వాస్త‌వాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. బ్యాంకు అధికారులతో కొంద‌రు కుమ్మక్కై సాధార‌ణ ప్ర‌జ‌ల ఐడీ కార్డులను దుర్వినియోగం చేస్తున్నాయని తేలింది. కొందరు మేనేజర్లు ఈ బ్లాక్‌మనీ మార్పిడి దందాకు సహకరిస్తున్నారు.

ఆ ఐడీల‌ను ఉప‌యోగించి ప‌రిమితి మేర‌కే డ‌బ్బును మారుస్తూ త‌మ క‌మీష‌న్‌లు తాము తీసుకుంటున్నారు. ఇక్క‌డే ఇంకో విచిత్రం కూడా చోటు చేసుకుంటుంది. కొన్ని టెలికాం కంపెనీల‌తో కుమ్మ‌కైన కొంద‌రు ఫోన్ సిమ్ తీసుకునేందుకు ఇచ్చిన ఐడీ ప్రూఫ్ల‌ను కూడా తీసుకుని న‌గ‌దు మార్చుకుంటున్న‌ట్లు వెల్ల‌డైంది.

Loading...

Leave a Reply

*