విశాఖ వ‌న్‌డే మ్యాచ్‌లో మార్మోగుతున్న గౌత‌మీపుత్ర శాత‌కర్ణి హంగామా..!

untitled-6

నేడు ఇండియా వ‌ర్సెస్ కివీస్ మ‌ధ్య కీ ఫైట్ జ‌రుగుతోంది. ఇప్పటికే 2-2తో స‌మానమైన సిరీస్‌లో ఫైన‌ల్ విన్న‌ర్ ఎవ‌రో తేలిపోనుంది ఈ మ్యాచ్‌లో. ధోనికి ఎంతో అచ్చివ‌చ్చిన వేదిక‌లో ఈ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. అయితే, నేటి మ్యాచ్‌కి బాల‌య్య గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమాకి ఓ లింక్ ఉంది. అదేంటంటే.. బాల‌య్య కెరీర్‌లోనే ప్రిస్టీజియ‌స్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకి గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి.. అంటే గౌత‌మీపుత్రుడు అని అర్ధం వ‌చ్చేలా పెట్టారు. ఇది మాతృస్వామ్య వ్య‌వ‌స్థ‌ను తెలియ‌జేస్తోంది.

శాత‌వాహ‌న రాజులది మాతృస్వామ్య కుటుంబ పాల‌న అని కొంద‌రంటే.. మ‌రికొంద‌రు మాత్రం కేవ‌లం ఒక‌రిద్ద‌రు రాజులు త‌మ తల్లి మీద ఉన్న అవ్యాజ‌మైన ప్రేమ‌తో అలా పేరును ఫిక్స్ చేసుకున్నార‌ని స‌మాచారం.స‌రిగ్గా ఇలాగే.. ఇవాళ టీమిండియా ప్లేయ‌ర్‌లు త‌మ త‌మ‌ త‌ల్లి పేరున్న జెర్సీల‌తో బ‌రిలో దిగ‌నున్నారు. ధోని, కోహ్లితోపాటు ఇత‌ర టీమ్ స‌భ్యులంతా కూడా త‌మ తల్లి పేరున్న జెర్సీల‌తోనే వ‌చ్చారు. టీమిండియాకి అఫిషియ‌ల్ స్పాన్స‌ర్‌గా ఉన్న స్టార్ గ్రూప్‌… ఇలా తండ్రికే కాదు.. త‌ల్లికి కూడా గౌర‌వం ఇవ్వాల‌ని చేస్తున్న ఓ క్యాంపెయిన్‌లో భాగంగా ఇలా కొత్త జెర్సీల‌తో గ్రౌండ్‌లో దిగారు మ‌న‌వాళ్లు.

దీంతో, దీనిని చూసిన వ్యూయ‌ర్స్‌కి బాల‌య్య‌-క్రిష్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న‌ గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి గుర్తుకు వ‌స్తోంది. త‌ల్లి పేరుతో ఓ బ‌డా హీరో సినిమా రిలీజ్ అవ్వ‌డం అంటే మాట‌లు కాదు. అందుకే, ఇవాళ టీమ్ ఇండియా చేస్తున్న‌దానికి, బాలయ్య సినిమాకి ద‌గ్గ‌రి పోలిక‌లు ఉన్నాయంటున్నారు విమ‌ర్శ‌కులు. అందుకే, విశాఖ క్రికెట్ మ్యాచ్‌లో బాల‌య్య సినిమా పేరు మార్మోగుతోంద‌ని నంద‌మూరి అభిమానులు ఖుషీ ఖుషీగా ఉన్నారు.

Loading...

Leave a Reply

*