ఆ కుల్ డ్రింక్స్‌లో విషం

cooldrinks

సైజు నాజుగ్గా మారింది. ప‌ట్టుకెళ్లేందుకు వీలుగా ఉంటుంది. దాంతో గాజు సీసాల స్థానంలో వ‌చ్చిన పెట్ బాటిల్స్ అమ్మ‌కాలు జోరందుకున్నాయి. ప‌ది రూపాయ‌లకు సైతం అర‌చేతిలో ఇమిడిపోయే సైజులో ఓ చిన్న బాటిల్ పాక్స్ రావ‌డంతో జ‌నం కూడా వాటిప‌ట్ల ఆక‌ర్షితుల‌వుతున్నారు. అయితే, భార‌త ప్ర‌భుత్వం చెబుతున్న సంగ‌తి వింటే ఈ పెట్ బాటిల్స్‌లో కూల్‌డ్రింక్స్ తాగేవారికి గుండె గుభిల్లే. పెప్పికో, కోకొకోలా కంపెనీలు త‌యారు చేస్తున్న ప‌లు సాఫ్ట్ డ్రింక్స్‌లో ఐదు ర‌కాల విష ప‌దార్థాలు ఉన్న‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల నిర్వ‌హించిన ప‌రిశీల‌న‌లో తేలింది. ఆరోగ్య‌శాఖ‌కు చెందిన డ్ర‌గ్స్ టెక్నిక‌ల్ అడ్వైజ‌రీ బోర్డు (డీటీఏబీ) నిర్వ‌హించిన ప‌రిక్ష‌ల‌లో పెప్సీ, కోకొకోలా, మౌంటెన్ డ్యూ, స్ర్పైట్‌, సెవెన‌ప్ వంటి కూల్‌డ్రింక్స్‌లో యాంటిమోనీ, సీసీ, క్రోమియం, కాడ్మియం, డైప్తాలెట్ వంటి హానిక‌ర ర‌స‌యానాలు స‌మ్మిళిత‌మై ఉన్నాయ‌ని తెలింది. ఈ వివ‌రాల‌న్నీ డీటీఏబీ వెబ్‌సైట్‌లో న‌మోదై ఉన్నాయి. అయితే, ఈ వార్త‌ల‌ను స‌ద‌రు శీత‌ల‌పానియాల సంస్థ‌లు ఖండించాయి. ప్ర‌భుత్వం నుంచి త‌మ‌కు ఈ విష‌య‌మై ఎలాంటి నివేదిక‌లు అంద‌లేద‌ని, పెప్సీకో, కోకొకోలా ప్ర‌తినిధులు తెలిపారు.

Loading...

Leave a Reply

*