గాలి పెళ్లికి జ‌గ‌న్ వెళ్ల‌నిది ఇందుకేన‌ట‌

jagan

అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన గాలి జ‌నార్ద‌న్ రెడ్డి ఇంటిలో పెళ్లికి ఏపీ విప‌క్ష నేత జ‌గ‌న్ హాజ‌రు కాక‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశం అయ్యింది. గాలికి జ‌గ‌న్‌కు ఉన్న స‌న్నిహ‌త బంధం నేప‌థ్యంలో జ‌గ‌న్ క‌చ్చితంగా పెళ్లికి వెళ్తార‌ని అంద‌రూ భావించారు. అయితే, జ‌గ‌న్ మాత్రం పెళ్లికి హాజ‌రు కాలేదు. దీనికి ప‌లు ర‌కాల కార‌ణాలు చెప్పుకుంటున్నారు. నోట్ల ర‌ద్దుతో దేశంలోని అంద‌రి దృష్టి గాలి పెళ్లిపైనే ప‌డింది. పెళ్లి విష‌యం చివ‌ర‌కు పార్ల‌మెంట్‌లోనూ ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చింది. బీజేపీ అధినేత అయితే త‌మ పార్టీ నేత‌లెవ్వ‌రూ ఆ పెళ్లికి పోవ‌ద్దంటూ మౌఖిక ఆదేశాలిచ్చారు.

ఇలాంటి ప‌రిస్థితుల్లో ఆ పెళ్లికి వెళ్తే విమ‌ర్శ‌లు మూట‌గ‌ట్టుకోవాల్సి వస్తుంద‌ని భావించే జ‌గ‌న్ దానికి దూరంగా ఉన్న‌ట్లు చెబుతున్నారు. అయితే, పెళ్లికి వెళ్ల‌కున్నా… హైద‌రాబాద్‌లో జ‌రిగే రిసెప్ష‌న్‌కు వ‌స్తాన‌ని గాలికి జ‌గ‌న్ మాట ఇచ్చార‌ట‌. ఈ నెల 20న హైద‌రాబాద్‌లో గాలి త‌న కుమార్తె పెళ్లి విందును ఏర్పాటు చేశార‌ట‌. ఇక్క‌డే జ‌రుగుతుంది కాబ‌ట్టి దానికి వెళ్తే అటు గాలిని సంతృప్తి ప‌ర‌చ‌వ‌చ్చ‌ని, పెళ్లికి వెళ్ల‌కుండా తాను విమ‌ర్శ‌ల దాడి నుంచి దూరంగా ఉండ‌వ‌చ్చ‌ని జ‌గ‌న్ ప్లాన్ వేశార‌ట‌. అందుకే పెళ్లికి గైర్హాజ‌ర‌య్యార‌న్న‌ది తాజా స‌మాచారం.

Loading...

Leave a Reply

*