టీడీపీ అధ్య‌క్ష ప‌ద‌వికి బాబు రాజీనామా?

untitled-141

టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు ఇక త‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌నున్నారా? ముఖ్య‌మంత్రిగా ఉన్న ఆయ‌న రెండో ప‌ద‌వి కూడా త‌న వ‌ద్ద ఉంచుకోవ‌ద్ద‌ని నిర్ణ‌యించుకున్నారా? టీడీపీ శిక్ష‌ణా శిబిరంలో మూడో రోజు తీసుకున్న కీల‌క నిర్ణ‌యం ప్ర‌కారం అవున‌నే అనుకోవాల్సి వ‌స్తుంది. ఎందుకంటే…. పార్టీలో ఇక‌పై ఒకరికి ఒక ప‌ద‌వి మాత్ర‌మే ఉండాల‌ని టీడీపీ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. సాధార‌ణంగా దీనికి అర్థం ప్ర‌భుత్వంలో కానీ పార్టీలో కాని ఏదోక ప‌ద‌వి మాత్ర‌మే ఒక నేత‌కు ఇవ్వాలి అనే. బీజేపీలో కూడా ఇది అమ‌ల‌వుతోంది. అలాగే క‌మ్యూనిస్టు పార్టీల్లో కూడా ఇదే ప‌ద్ధ‌తి పాటిస్తున్నారు.

పార్టీ ప‌ద‌వులు వ‌ద్ద‌నుకునే వారిని ప్ర‌భుత్వంలోకి ప్ర‌భుత్వ ప‌ద‌వులు వ‌ద్ద‌నుకునేవారికి పార్టీలో ప‌ద‌వులు ఇస్తారు. ఆ క్ర‌మంలోనే ఇప్పుడు టీడీపీ కూడా ఈ త‌ర‌హా నిర్ణ‌యం తీసుకుంది. అంటే ఇప్ప‌టికున్న సంప్ర‌దాయం ప్ర‌కారం ముఖ్య‌మంత్రిగా ఉన్న చంద్ర‌బాబు పార్టీ అధ్య‌క్షుడిగా ఉండ‌కూడ‌దు. అయితే, ఈ విష‌యంలో టీడీపీ తీసుకున్న నిర్ణ‌యానికి ఏవైనా చుక్క‌మార్కు ష‌ర‌తులున్నాయేమో తెలియ‌దు. ముఖ్య‌మంత్రికి, జాతీయ అధ్య‌క్షుడికి త‌ప్పించి మిగిలిన వారికి మాత్ర‌మే ఈ నిబంధ‌న అనే ష‌ర‌తుల వ‌ర్తిస్తాయి అన్న విష‌యం ఏదైనా ఉంటే మాత్రం చంద్ర‌బాబు రెండు ప‌ద‌వుల‌లో కొన‌సాగుతారు.

Loading...

Leave a Reply

*