చంద్ర‌బాబు కేంద్రానికి లొంగింది ఇందుకేనా?

mocha

చంద్ర‌బాబులో కొత్త ఉత్సాహం క‌నిపిస్తోంది. ఏపీ సీఎంలో ఈ కొత్త ఉత్సాహ‌మే… ఆయ‌న కేంద్రానికి ఏ విష‌యంలో లొంగిపోయారో స్ప‌ష్టం చేస్తోంది.  హోదా ఇవ్వ‌డంలేద‌ని కేంద్రం చెప్పిన త‌ర్వాత రాష్ట్రంలో పెల్లుబికిన నిర‌స‌న కొద్ది రోజుల‌కే సైలెంట్ అయ్యింది. అయితే, అది సైలెంట్ అయ్యిందా… నివురుగ‌ప్పిన నిప్పులా ఉందా అనేది ప‌క్క‌న‌పెడ‌దాం. కేంద్రం ఇచ్చిన ప్యాకేజీని స్వాగ‌తించిన చంద్ర‌బాబు ఆ త‌ర్వాత కూడా దానిపై మ‌రింత దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. హోదాపై ఆందోళ‌న‌లు జ‌రిగిన స‌మ‌యంలో విప‌క్షాల‌పై తీవ్ర ఆగ్ర‌హాన్ని ప్ర‌ద‌ర్శించాయి. చంద్ర‌బాబు కేసుల‌కు భ‌య‌ప‌డే కేంద్రానికి లొంగిపోయార‌ని, రాష్ట్రాన్ని తాక‌ట్టు పెట్టార‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు.

అయితే, బాబు కేంద్రం చెప్పిన ప్యాకేజీకి ఒప్పుకోవ‌డం వెనుక ప్ర‌ధాన కార‌ణం ఇప్పుడు బ‌య‌ట‌ప‌డింది. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత న‌డిరోడ్డుపై నిల‌బ‌డ్డ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు జీవ‌నాధారం పోల‌వ‌రం. ఈ విష‌యంలో అధికార‌, ప్ర‌తిప‌క్షాల‌కు భిన్నాభిప్రాయం లేదు. పోల‌వ‌రం పూర్త‌యితే ఇక రాష్ట్రానికి తిరుగుండ‌ద‌ని అంద‌రూ చెప్పే మాట‌. హోదా ఇవ్వ‌కున్న కేంద్రం ఇస్తున్న ప్యాకేజీకి చంద్ర‌బాబు ఒప్పుకున్న‌ది కూడా ఇందుకే. పోల‌వ‌రానికి వంద‌శాతం నిధులు ఇస్తామ‌ని కేంద్రం ఇచ్చిన హామీకే చంద్ర‌బాబు లొంగిపోయారు. హోదా రాకున్నా… క‌నీసం పోల‌వ‌రానికి పూర్తిస్థాయి నిధ‌లు భ‌రిస్తామ‌ని కేంద్రం చెప్పిన మాట‌ల‌కు బాబు ప‌డిపోయారు.

మ‌రో రెండేళ్ల‌లో రాష్ట్ర ప్ర‌జ‌ల క‌ల అయిన పోల‌వ‌రం పూర్త‌యితే తామే స్వ‌యంగా ఎద‌గ్గ‌ల‌మ‌ని చంద్ర‌బాబు త‌ల‌పోస్తున్నారు. అప్పుడు కేంద్రం ఇచ్చిన భ‌రోసా మేర‌కు పోల‌వ‌రానికి నాబార్డు రుణం ఇచ్చేందుకు కూడా అంగీక‌రించింది. దాంతో పోల‌వ‌రం పనులు వేగ‌వంతంగా పూర్త‌వుతున్నాయి. అంటే అప్ప‌ట్లో ద‌వ‌ళేశ్వ‌రం బ్యారేజీ క‌ట్టించిన కాట‌న్ దొర దేవుడైన‌ట్లే… పోల‌వ‌రం పూర్త‌యితే చంద్ర‌బాబు చ‌రిత్ర‌లో నిలిచిపోతారు. అందుకే చంద్ర‌బాబు ఇప్పుడు మ‌రింత ఉత్సాహంగా క‌నిపిస్తున్నారు.

Loading...

Leave a Reply

*